హైదరాబాద్

ముగిసిన బాలల చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: దేశ విదేశాలకు చెందిన విభిన్న కళాంశాల్లో ప్రతిభావంతులైన చిన్నారి కళాకారులు, బాలమేధావులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన 19న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 14వ తేదీన మాదాపూర్ శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ చిత్రోత్సవంలో సుమారు 170 దేశాలకు చెందిన చిన్నారులు, బాలల చిత్ర నిర్మాతలు, బాలసాహితీవేత్తలు పాల్గొన్నారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో భాగంగా నగరంలో పేరుగాంచిన ప్రసాద్ ఐమాక్స్, హైటెక్స్, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి, హరిహర కళాభవన్‌తోపాటు మొత్తం 13 థియేటర్లలో ఒక నిమిషం విడిది మొదలుకుని రెండున్నర గంటల విడిది కల్గిన విభిన్నా భాషా చిత్రాలు, యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించారు. కానీ ప్రధాన సందడి నగరంలోని ప్రసాద్ ఐమాక్స్, మాదాపూర్ హైటెక్స్‌తో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో సల్పంగా కన్పించింది. తొలి రెండు రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన చిన్నారులకు ఆహ్వానం పలకం, ఎక్కడెక్కడ ఏ చిత్రాలు ప్రదర్శిస్తున్నది వివరంగా తెలపటం వంటి ఏర్పాట్లు చేసిన అధికారులు నాలుగు రోజుల చిత్రోత్సవం గడిచిన తర్వాత చిన్నారులను పెద్దగా పట్టించుకున్న సందర్భాల్లేవు. చివరి మూడు రోజుల్లో చిత్రోత్సవ ఉత్సాహాం, సందడి కేవలం ఐమాక్స్‌కే పరిమితం కాగా, ముగింపు ఉత్సవాలు శిల్పకళావేదికలో జరిగాయి. చిత్రాల ప్రదర్శన కోసం ఎంపిక చేసిన అత్తాపూర్‌లోని ఈశ్వర్ వంటి థియేటర్లలో బాలల చిత్రోత్సవాలను వీక్షించేందుకు వచ్చే వారి సంఖ్య మొదటి నుంచి తక్కువగానే కన్పించింది. సంబంధిత శాఖ ఈ చిత్రోత్సవానికి సంబంధించిన తగిన ప్రచారాన్ని కల్పించకపోవటమే కారణమన్న ఆరోపణలున్నాయి.
చలనచిత్రోత్సవానికి స్పందన
అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో భాగంగా ఆరు రోజులుగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రదర్శించిన సినిమాలు బాలలను ఆలోచించేసేవిగా వున్నాయని జవహర్ బాలభవన్ డైరెక్టర్ సుధాకర్ అన్నారు. బాలలతోపాటు తల్లిదండ్రులు కూడా రావడంతో ఊహించినదానికన్న ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. వర్క్‌షాప్ ఏర్పాటు చేయడంతో చిత్రలేఖనం తదితర రంగాల్లో బాలలు అధికంగా పాల్గొన్నారని అన్నారు. ఈ చిత్రోత్సవాలద్వారా బాలలు అంతర్జాతీయ విలులను, ఆయా ప్రాంతాల విద్యా విధానాలు కూడా తెలుసుకోగలిగారని బాలభవన్ డైరెక్టర్ సుధాకర్ అన్నారు.

వెయిట్ , పవర్ లిఫ్టింగ్ చాంపియన్లు రాజస్థాన్, తమిళనాడు
హైదరాబాద్, నవంబర్ 20: ఆలిండియా పోస్టల్ వెయిట్ లిఫ్టింగ్ టీమ్ చాంపియన్‌షిప్ రాజస్థాన్ సర్కిల్ జట్టు, పవర్ లిఫ్టింగ్ టీమ్ చాంపియన్‌షిప్ తమిళనాడు సర్కిల్ జట్టు కైవసం చేసుకున్నాయి. నగరంలోని ఎల్బీస్టేడియంలో జరిగిన ఆలిండియా పోస్టల్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో రాజస్థాన్ సర్కిల్ జట్టు 198 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి టీమ్ చాంపియన్‌గా ఆవిర్భావించింది. మహారాష్ట్ర సర్కిల్ జట్టు 127 పాయింట్లతో ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. ఆలిండియా పోస్టల్ పవర్ లిఫ్టింగ్ టీమ్ చాంపియన్‌షిప్ తమిళనాడు సర్కిల్ జట్టు కైవసం చేసుకుంది. తమిళనాడు జట్టు 51 పాయింట్లు సాధించి విజేతగా ఆవిర్భావించగా, ఆంధ్రప్రదేశ్ జట్టు 50 పాయింట్లతో ద్వితీయస్థానాన్ని సాధించింది. శరీర సౌష్టవ పోటీలో మహారాష్ట్ర సర్కిల్ జట్టు 160 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టీమ్ చాంపియన్‌గా ఆవిర్భావించగా, తమిళనాడు సర్కిల్ 150 పాయింట్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఉత్తమ వెయిట్ లిఫ్టర్‌గా తమిళనాడుకు చెందిన మణికందన్, పవర్ లిఫ్టర్‌గా రాజేష్‌లకు అవార్డులు లభించాయి. ఆలిండియా పోస్టల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, శరీర సౌష్టవ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బహుమతులు ప్రదానం చేశారు.
టగ్ ఆఫ్ వార్ జట్లకు కిట్ల ప్రదానం
అసోంలో జరిగే జాతీయ సబ్ జూనియర్, జూనియర్ టగ్ ఆఫ్ వార్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్లకు అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి కిట్లను ప్రదానం చేశారు. టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ కార్యదర్శి ఇమాన్యుల్, ఉపాధ్యక్షుడు మహేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి జానకీరామ్ పాల్గొన్నారు. తెలంగాణ సబ్-జూనియర్ బాలుర జట్టు: దుర్గారెడ్డి, రాజేష్, శ్రీకాంత్, రాజు, విజయ్ అమర్‌నాథ్, రాందాస్, నర్సింగ్, దినకర్, వరప్రసాద్, కోచ్‌గా రాఘవేంద్ర యాదవ్, మేనేజర్‌గా శివశంకర్ వ్యవహరిస్తారు. బాలుర జూనియర్ జట్టు: రాజ్‌కుమార్, మహేశ్, సరుూద్ అబ్రార్, సురేష్, వెంకటేష్, మదన్‌మోహన్, సురేష్, నరేష్, మహేందర్, కోచ్‌గా శేఖర్, మేనేజర్ సంతోష్ కుమార్ వ్యవహరిస్తారు.