హైదరాబాద్

హఫీజ్‌పేట ఫ్లై ఓవర్‌పై దగ్ధమైన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, డిసెంబర్ 6: హఫీజ్‌పేట ఫ్లై ఓవర్‌పై ఓ కారు దగ్ధమైంది. టైర్లకు మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. పూర్తిగా కాలిపోయిన తర్వాత అగ్నిమాపక యంత్రం వచ్చి నీళ్లు చల్లింది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బిహెచ్‌ఇఎల్‌కు చెందిన సుబ్బరాజు, అభిషేక్, రోణాలు ఆదివారం మాదాపూర్‌లోని ఐనార్బిట్‌బాల్‌కు వెళ్ళారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఫోర్డ్ ఐకాన్ కారు (ఎపి 12 ఎన్ 6543)లో తిరిగి వస్తున్నారు. కొండాపూర్ వద్ద మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారు ఆగిపోవడంతో పెట్రోలు పోసుకుని బయలుదేరారు. హఫీజ్‌పేట వంతెన మధ్యలోకి రాగానే ఇంజన్‌లో నుంచి పొగలు రావడంతో దిగి చూశారు. వెంటనే కారంతా పొగ వ్యాపించి మంటలు అంటుకున్నాయి. టైర్లకు మంటలు అంటుకోగానే నాలుగుసార్లు పేలుడు శబ్దం వినిపించింది. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయింది. అనంతరం వచ్చిన ఫైరింజన్ నీళ్లు చల్లింది. ట్రాఫిక్ పోలీసులు రికవరీ వ్యాన్ సాయంతో కాలిన కారును అక్కడి నుంచి తరలించారు. బాటిల్ ద్వారా పెట్రోల్ పోయడంతో వెడికి మంటలు వ్యాపించి ఉండవచ్చునని భావిస్తున్నారు. మియాపూర్ ఇన్స్‌పెక్టర్ రమేష్ కొత్వాల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.