జాతీయ వార్తలు

గాంధీ కుటుంబేతరులు వస్తే కాంగ్రెస్‌లో చీలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి గాంధీ కుటుంబేతరులు వస్తే ఆ పార్టీ 24 గంటల్లో చీలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 134 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేకపోవటం బాధాకరమని అన్నారు. అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబేతరులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఇతరులెవరు వచ్చిన ఆ పార్టీ ముక్కలుగా చీలిపోతుందని అన్నారు. అధ్యక్ష స్థానానికి ప్రియాంక గాంధీ అయితే సరితూగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోన్‌భద్ర బాధిత కుటుంబాలను కలవడంలో ప్రియాంక ఎంతో తెగువ చూపారంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.