జాతీయ వార్తలు

ప్రజలను భాగస్వాములను చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛ్భారత్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: స్వచ్ఛ భారత్ పథకం అమలులో ప్రజలను భాగస్వామిగా చేసి ఒక ఉద్యమంలా తీర్చిదిద్దాలని మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ సూచించారు. స్వచ్ఛ భారత్ అమలు జరుగుతున్న తీరు తెన్నులపై ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించారు. స్వచ్ఛ భారత్ పథకం అమలులో రాష్ట్రాలు తొలుత కొంత నిర్లిప్తంగా వ్యవహరించినప్పటికీ ఇప్పుడు చురుకుగ్గా పనిచేస్తున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజలు భాగస్వామ్యం ఆశించిన మేరకు ఉందని ఆయన బిల్ గేట్స్‌కు వివరించారు. స్వచ్ఛ్భారత్ అమలులో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిని ఏర్మాటు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి ఇచ్చి ఆ సదుపాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునే చర్యలు తీసుకోవలసిందిగా బిల్‌గేట్స్ సూచించారు. ఆఫ్రికాలో నిర్మితమైన మరుగుదొడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని గేట్స్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మురుగునీటి పారుదలకు గట్టి చర్యలు తీసుకోవలసిందిగా ఆయన సూచించారు. స్వచ్ఛ భారత్ అమలులో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేయటానికి ప్రాధాన్యత ఇసున్నామని మంత్రి బిల్ గేట్స్ దృష్టికి తెచ్చారు. (చిత్రం) పార్లమెంటు హౌస్‌లో శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలుసుకున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్