జాతీయ వార్తలు

గోవా సీఎంపై ఎడతెగని చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: అనారోగ్యంతో మృతిచెందిన గోవా సీఎం పారకర్ మృతితో ఆయన స్థానంలో మరో ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న మొదలైంది. సంకీర్ణ భాగస్వామ్యపక్షాలను కలుపుకుంటూ గోవా సామాన్యుడిగా పేరుతెచ్చుకున్న పారికర్ వంటి రాజనీతిజ్ఞుడు కోసం బీజీపే అనే్వషణ ప్రారంభించింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గోవా విచ్చేసి పారికర్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించిన తరువాత ఆయన భాగస్వామ్య పక్షాలతో ఎడతెగని చర్చలు కొనసాగిస్తున్నారు. పారికర్ అనారోగ్యంతో సచివాలయానికి రాకున్నా, దీనిపై కాంగ్రెస్ విమర్శలు చేసినా పట్టించుకోకుండా ఆయననే సీఎంగా బీజేపీ అధిష్టానం కొనసాగించటం వెనుక గల కారణాలు దేశ రాజకీయాల్లో ఆయనకు ఉన్న ప్రత్యేకత అదే. గోవాలో సంకీర్ణ ప్రభుత్వాలు నిలకడగా పాలించలేని కాలంలో రక్షణ మంత్రిగా పనిచేస్తున్న పారికర్ గోవా రాష్ట్ర బాధ్యతలు చేపట్టి ఆక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 1994 ఎన్నికల విజయం అనంతరం ఆయన గోవా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవటంతో పారికర్ ఎంతో నేర్పరి. సామాన్య జీవితం, నిజాయతీ, నిరాంబరత ఆయనకు పెట్టని ఆభరణాలు. అందుకే గోవా ప్రజలకు ఆయనంటే ఎంతో అభిమానం. అనారోగ్యంతో ఉన్నా ఆయననే సీఎంగా ప్రజలు అంగీకరించారంటే అతి చిన్న రాష్ట్రంలో అక్కడ ప్రజలు ఆయన పట్ల చూపిన అభిమానం అలాగే కేంద్ర రాజకీయాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన దక్షతను గుర్తించి కేంద్ర రక్షణ బాధ్యతలు అప్పగించటమే నిదర్శనం.

పలువురు పోటీ

పారికర్ మృతితో గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. సంకీర్ణపక్షమైన మహారాష్టవ్రాది గోమంటక్ పార్టీ నేత సుదిన్ ధావలికర్ తనను సీఎంను చేయాలని పట్టుబడుతున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్‌దేశాయ్ కూడా సీఎం స్థానానికి పోటీపడుతున్నారు. మా పార్టీ ఇంతవరకు పారికర్‌కు మద్దతు పలికింది బీజేపీకి కాదు అని విజయ్ వాఖ్యానించటం గమనార్హం. కాగా మళ్లీ బీజేపీ అభ్యర్థిని సీఎం స్థానంలో నిలబెట్టేందుకు మరో ఆ పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తుంది. మరోవైపు గోవా అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ సైతం తన ప్రయత్నాలు ఆరంభించింది. గోవా అసెంబ్లీలో బీజేపీకి 12 స్థానాలు ఉండగా సంకీర్ణ పక్షాలతో కలుపుకుని 20 మంది శాసనసభ్యులతో ప్రభుత్వాన్ని నడుపుతుంది. కాంగ్రెస్‌కు 14మంది శాసనసభ్యులు ఉన్నారు.