గ్రహానుగ్రహం

రాహు కేతువుల ప్రభావం -గ్రహానుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధిక (నెల్లూరు)
ప్రశ్న: కుజదోషం శాంతి చేయించుకుంటే పోతుందా? శాంతి ఏమి చేయాలి?
జ: జాతక చక్రంలో కుజదోషం ఉన్నది. దాని వలన ఏమిటి నష్టం ఒకసారి ఆలోచించండి. కుజ దోషం అనే పేరు పెట్టారు అని అది ఏదో దోషం అనుకోవడం తప్పు. కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవడమే శాంతి. అందరూ కుజదోషం ఉన్నది అనే అంశంతో ఎక్కువ భయపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా శాంతులు చెప్పేవారు కూడా ఉంటారు. ఒకవేళ లగ్నాత్ అష్టమంలో కుజుడు ఉన్నాడు. కుజదోషం ఉంటుంది. కుజ జపం, కుజ హోమం, సుబ్రహ్మణ్య జపం, సుబ్రహ్మణ్య హోమం వంటివి శాంతి మార్గాలు అనుష్ఠించాము. శాంతి మార్గాలు అయిన తరువాత మరల జాతకచక్రం చూస్తే కుజుడు లగ్నాత్ అష్టమంలోనే ఉంటాడు కానీ మారడు కదా! శాంతి చేయక ముందు లగ్నాత్ అష్టమంలో వున్న కుజుడు శాంతి తరువాత కూడా లగ్నాత్ అష్టమంలోనే ఉంటాడు కావున కుజ దోషం శాంతులు చేయించినంత మాత్రాన కుజదోషం పోదు. మరి శాంతులు చేయించుకోవడం వలన వచ్చే విశేషం ఏమిటంటే, కుజదోషం ప్రభావంగా మనిషి పడే బాధలు ఏవైతే ఉంటాయో వాటి స్థాయి తగ్గుతుంది. కలహాలు మరియు అనారోగ్యాల వంటివి కుజదోషం ప్రభావంతో వచ్చే ఫలితాలు చాలావరకు తగ్గుతాయి. అంతే కాకుండా భార్యాభర్తలలో ఒకరికి కుజదోషం ఉండి మరొకరికి కుజదోషం లేకపోతే అప్పుడు శాంతి చేయించుకోవడం వలన కుజదోషంతో వచ్చే ఫలితాంశములు తగ్గుతాయి. దంపతులలో కలహముల స్థాయి తగ్గుతుంది. అలాగే మనస్ఫర్థలు తగ్గుతాయి. ఇలాగ శాంతి ప్రభావం ఉంటుంది కానీ శాంతి చేయించుకోవడం వలన కుజదోషంపోదు. శాంతి ప్రభావంచేత కలహ దోషాలు తగ్గుతాయి.

లక్ష్మీనారాయణ (విజయవాడ)
ప్రశ్న: వివాహ పొంతనలలో రాహు కేతువుల ప్రభావం ఎలా ఉంటుంది?
జ: రాహు కేతువుల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. సహజంగా కుజదోషం అని ఎక్కువగా వెంటపడతారు. కానీ రాహుకేతు దోషం మీద ఎక్కువగా శ్రమ చేయాలి. రాహు కేతువులు కళత్ర స్థానంతో సంబంధీకులు అయితే కళత్ర అవయోగం సంతాన స్థానంతో ముడిపడితే సంతాన అవయోగం వంటివి చెప్పారు. మరి ఈ అవయోగములను దాటి మంచి సంసార జీవనం సాగించాలి అంటే రాహుకేతు దోషం లేని జాతకములు పరిగ్రహించాలి. వధూవరులకు ఇరువురికీ లగ్నంలో రాహువు ఉంటే దోషం. అలాగే సప్తమంలో రాహువు ఉంటే దోషము. ఇరువురికీ కుటుంబ స్థానంలో వుంటే దోషము. మరి ఇది ప్రత్యక్ష నిదర్శనం కూడా. వధూవరుల జాతకంలో శుక్ర రాహువు పది డిగ్రీల దూరంలో ఉన్ననూ గురు రాహువులు పది డిగ్రీల మధ్యలో వున్ననూ చాలా ఇబ్బందులు రాగలవు. మరొక విషయం. సౌభాగ్య స్థానంలో రాహువు ఆడవారికి (అష్టమ స్థానం సౌభాగ్య స్థానం) ఉంటే చాలా ప్రమాదం. వధూవరులలో ఇరువురికీ ఒకరికి లగ్నంలో మరొకరికి ద్వితీయంలో రాహువు ఉన్ననూ దోషమే. మరి సంతాన స్థానం చాలా ఎక్కువగా నిశితంగా పరిశీలించాలి. కుజదోషం కంటే రాహు దోషమే ఎక్కువ.
**
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336