గ్రహానుగ్రహం

పుష్కరాలలో ఏ రోజు శ్రాద్ధం నిర్వహించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవశర్మ (విజయనగరం)
ప్రశ్న: ధనే వ్యయేచ పాతాశే అని కొందరు, లగ్నే వ్యయే చ పాతాశే అని కొందరు చెబుతారు. ఏది నిజం.
జ: రెండూ సూక్ష్మంగా విశదీకరణగా శోధించాలి అంటే దీనికి సంబంధించి ఇతర ప్రాథమిక అంశాలు పూర్తిగా శోధించాలి. * శోధించగా ధనే వ్యయేచ పాతాశే అనే పాఠం నిజం అని తేలుతుంది. కొన్ని ఇతర అంశాలు గుర్తించండి. చంద్ర మంగళ సంయోగే కుజ దోషోన విద్యతే. లగ్నాత్, చంద్రాత్ శుక్రాత్ కుజదోషం చూడమన్నారు కదా! చంద్రాత్ కుజదోషం అన్నప్పుడు చంద్రుడు కుజుడితో కలిస్తే కుజదోషం లేదు అన్నప్పుడు లగ్నే వ్యయేచ పాతాశే పాఠం తప్పు కదా. స్థితః కుజః పతింహన్తి న చేచ్ఛు భయతేక్షితః అన్నప్పుడు శుభ గ్రహాలతో కలయిక వలన కుజదోషం ఉండదు అనే బృహత్వంతరీ హోరా శాస్త్రం పాఠం ప్రకారం శుక్ర కుజుల కలయిక కుజదోషం వుండదు కదా. శుక్రాత్ కుజదోష శోధన చేయునప్పుడు లగ్నే వ్యయే చ అని చూస్తే శుక్రుడు కుజుడు కలిస్తే కుజదోషం లేదు అనే అర్థం వస్తుంది కదా! అందువలన ‘్ధనే వ్యయేచ పాతాశే జామిత్రే చాష్టమే కుజే - స్థితః కుజః పతింహన్తి వ చేచ్ఛు భయతే క్షితః అనేది శాస్ర్తియ వాదన. లగ్నే’ అనేది తప్పు.

లక్ష్మీనారాయణ (గుంటూరు)
ప్రశ్న: అసలు కుజదోషం - స్థానములు ఎందుకు వివరణ ఇచ్చారు. దానికిగల ఫలితాంశములు వివరం ఇవ్వగలరు.
జ: కుజుడు కలహకారకుడు అనే విషయం తెలుసు కదా. మరి కుజుడు ద్వితీయంలో వుండగా కుటుంబ స్థాన స్థితి ప్రభావం కుటుంబ యోగం కలహం చేస్తారు. చతుర్థంలో ఉండి బంధుస్థానం కలహప్రదం చేస్తారు. చతుర్థ స్థానం బంధుస్థానం కదా. 4వ దృష్టితో కళత్ర స్థానము వీక్షించి కళత్ర కలహం తెస్తారు. ఇక కళత్ర స్థానం ఏడవ ఇంట వుండి కళత్ర కలహం తెస్తారు. మరి ఎనిమిదవ స్థానంలో ఉండి ఏడవ దృష్టితో కుటుంబ స్థానం వీక్షించి కుటుంబ కలహం తీసుకువస్తారు. మరి ఇక పనె్నండవ స్థానంలో వుండి అష్టమ దృష్టితో కళత్ర స్థానం చూచి కళత్ర కలహం తెస్తారు. ఇదే రీతిగా కుజుడు గాయములు, ప్రమాదములకు కూడా కారకుడు. అందుచేత బహు కోణములలో కుజదోషం శోధన చేయవలెను. ‘ఆయుష్కారకుడు శని’ అందుకే పరాశరుడు కుజదోషం చెబుతూ ‘ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమేధలా శని’ చెప్పారు. అందువలన కుజదోషం కలహాల కోసం శని దోషం ఆయుష్షు కోసం పరిశీలింపవలెను.

రామనాథశాస్ర్తీ (గుంటూరు)
ప్రశ్న: పుష్కరాలలో 12 రోజులలో ఏ రోజు శ్రాద్ధం నిర్వహించడం విశేషం.
జ: 12 రోజులలో మీ తల్లిదండ్రుల పితృ తిథి ఒకవేళ వస్తే దానిని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ అలాగ రాకపోతే ఏ రోజయినా శ్రాద్ధం నిర్వహింపవచ్చు. మలిన జలాలతో పితృ శ్రాద్ధం నిర్వహించడం తప్పు. దేవతల కంటే పితృదేవతలే గొప్ప. అందువలన పుష్కర సందర్భంగా నీరు మలినం కాకుండా వున్నచోట శ్రాద్ధం నిర్వహించండి. ప్రకృతి సిద్ధంగా నీరు మలినం అయితే దోషం లేదు. కృత్రిమంగా మలినం చేయుట దోషము. అపరాహ్ణ కాలంగా పిలువబడే పగలు 12.00 నుండి 4.00 గంటల వరకు మాత్రమే పితృశ్రాద్ధం చేయవలెను.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336