గ్రహానుగ్రహం

వివాహ పొంతన ఎలా చూడాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహ పొంతన విషయంగా జాతకాలు చాలా సూక్ష్మంగా పరిశీలన చేయాలి అనే అంశం గురించి చాలామంది సంప్రదించటంవల్ల ఈ విషయాలు తెలియజేస్తున్నాం. * జాతకాలు చూపించి వివాహం చేసినా లేదా చూపించకుండా వివాహం చేసినా మనకు బ్రహ్మ లిఖితం ప్రకారం రాసి పెట్టి ఉన్న అమ్మాయి, అబ్బాయిలకే వివాహం అవుతుంది. * జాతకాలు చూడడం అనే టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సంబంధం గురించి వెంట పడకుండా ఉండటం కోసమే ఈ విధానం చెప్పారు. * జాతకాలు చూపించాం కదా అని అవగాహనా లోపాలు, విడాకులు వంటి దోషాలు సమసిపోవు. * జాతకాలు చూడటం ద్వారా మనం ఆయా గ్రహాలకు శాంతి చేయించుకొని ముందుకు వెడతాం. * ఒకవేళ ఆయుర్దాయం విషయంలో తేడాలు, వైధవ్యాలు వంటివి ఉంటే ‘కదళీ వివాహం’ వంటి శాంతి మార్గాలు అనే్వషిస్తాం. * ‘బ్రహ్మ లిఖితం చాలా బలవత్తరం’. అయితే ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శాస్త్రం ప్రతి మానవుడికీ విశేషంగా ఉపకరిస్తుంది అనే మాట అక్షర సత్యం.
ఇక - ప్రాకృత సబ్జెక్ట్‌లోకి వద్దాం. నక్షత్ర పొంతన కుజ దోషములు గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. జాతకంలో దోషాలు వుంటే నక్షత్ర రీత్యా బాగున్నా ముందుకు వెళ్లరాదు. జాతకంలో దోషాలు లేవు, యోగాలు లేవంటే ముందుకు వెళ్లవచ్చు. నక్షత్ర పొంతన కుదరలేదు, కుటుంబ కళత్ర, పుత్ర, ఆయు స్థానములు ఇరువురికీ బాగున్నాయి - ముందుకు వెళ్లి వివాహం చేయవచ్చు. అందుకే సమర్థుడయిన జ్యోతిష శాస్తవ్రేత్తను సంప్రదించాలి. మరి పంచాంగాలలో వ్రాసిన నక్షత్ర పొంతన ఆధారంగా చేసుకొని చాలామంది వివాహ ప్రయత్నాలు చేసుకుంటూ వారివారి పిల్లల జాతకాల ఆధారం దాకా వెళ్లకుండానే సంబంధాలు విరమిస్తున్నారు. ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుత్సాహ పడుతున్నారు.
కేవలం పంచాంగంలోని అంశాలను ఆధారం చేసుకొని పొంతనలు చేస్తే వివాహం కావడం కష్టం. పంచాంగాలు ప్రాథమిక అంశాలను మాత్రమే ఇస్తాయి. కేవలం పంచాంగం ఆధారం చేసుకోవడం తప్పు. నేను అవి సదుద్దేశంతో ప్రింట్ చేసినా వాటిని తేడాగా వాడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. * మరి కేవలం పాయింట్ల పట్టిక, లేదా తారాబలంతో వివాహ పొంతనలు కావు. మరి కంప్యూటర్ ద్వారా వచ్చే గణితం నిజమే. ఫలితాంశాలు 100% తప్పు ఉంటాయి అని గమనించండి. మరి సిద్ధాంతిని ఆశ్రయించినా ఆయుర్దాయం, కుటుంబ స్థానం, కళత్ర స్థానం, పుత్రస్థానం, ఆర్థికం, ప్రవర్తన, ప్రమాదాలు, రాబోవు దశలలో వచ్చే స్థితిగతుల వంటి విశేషాలు శోధన చేయాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది. అలాగే మ్యారేజ్ బ్యూరో వారు ఇచ్చిన ప్రతి సంబంధాన్ని సిద్ధాంతి దగ్గర పెట్టవద్దు. ఫిజికల్‌గా మీరు కుటుంబ, విద్య, ఉద్యోగ, సాంఘిక, గౌరవం, నడవడి, రూప లావణ్యాలు శోధన చేసి, ఫిల్టర్ చేసి తదనంతరం మీకు నచ్చిన సంబంధం మాత్రమే సిద్ధాంతి దగ్గర పెట్టండి. ప్రతి సంబంధం మీరు ఫిల్టర్ చేయకుండా వెడితే ఎక్కువ జాతకాలు చూసే ప్రయత్నంలో ఏ సిద్ధాంతి కూడా పూర్తిగా స్టడీ చేయకపోవచ్చు.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336