జాతీయ వార్తలు

గుల్బర్గ్ హత్యాకాండలో 11మందికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 11 మంది దోషులకు న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. గుజరాత్‌లోని గుల్బర్గ్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యలు చేసినట్లు రుజువైనప్పటికీ అంతకుముందు ఎలాంటి నేరచరిత్ర లేనందున ఈ 11 మందికి ఉరిశిక్ష వేయలేకపోతున్నట్లు కోర్టు పేర్కొంది. ఇదే కేసులో మరో 13 మందికి ఏడేళ్ల చొప్పున జైలుశిక్షలు విధించింది. సాక్ష్యాలు లేనందున 36 మందిని గతంలోనే నిర్దోషులుగా విడిచిపెట్టారు.