సంజీవని

ఛిన్నారుల్లో చిగుళ్ల సమస్యలుంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో చాలామంది చిన్న పిల్లలు చిగుళ్ళ, దంత సమస్యలతో వేధించబడుతున్నారు. పెద్దలు పిల్లల దంతాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోకపోవటంచే అతి చిన్న వయసులోనే పిల్లల దంతాలు సరియైన పలు వరుస లేక వంకర టింకరగా మారుతున్నాయి. పిల్లల ముఖానికి అందాన్నిచ్చే చక్కని ముత్యాల్లాంటి పలువరుస నేడు చాలామంది పిల్లల్లో చూడలేకపోతున్నాము. తల్లిదండ్రులు పిల్లలపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడంవలన చిగుళ్ళ, దంత, నోటి దుర్వాసన సమస్యలు తీవ్రంగా బాధిస్తున్నాయి.
ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో కనిపించే నోటి దుర్వాసన సమస్య, నేడు మారిన ఆధునిక జీవనశైలి విధానాల వలన పట్టుమని పది సంవత్సరాలు నిండని చిన్నారులు సైతం నోటి దుర్వాసన సమస్యతో బాధించ బడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చాక్లెట్స్, బేకరీ ఐటెమ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఈ అలవాట్లను పెద్దలు నివారించలేకపోవటంతో పిల్లలు దంతాల సమస్యతో తల్లడిల్లిపోతున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
కారణం.. - దంతాలు శుభ్రంగా వుంచుకోకపోవటం, దీర్ఘకాలిక బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్
- పిప్పిపళ్ళ సమస్య, చిగుళ్ల సమస్యతో బాధపడటం
- అతి చల్లని- అతి వేడి పదార్థాలు తీసుకోవడం, చాక్లెట్స్ అతిగా తినడం.
- జీర్ణకోశ వ్యాధులతో బాధపడే పిల్లల్లో సైతం ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు.. -నోటి దుర్వాసన వస్తుంది. అలాగే దంతాలు నొప్పిగా వుండి నమలడం కష్టంగా మారుతుంది.
- పంటి చిగుళ్లు వాపుతో కూడి ఉండి రక్తం కారుతూ ఉంటుంది..
- అతి చల్లని - అతి వేడి పదార్థాలు తీసుకున్నపుడు దంతాలు జివ్వున లాగుతాయ.
- ఇన్స్‌ఫెక్షన్స్ ఎక్కువగా వున్నపుడు పంటి నొప్పితోపాటుగా జ్వరం కూడా వస్తుంది.
జాగ్రత్తలు.. -పిల్లలు దంతాలను రోజుకు రెండుసార్లు శుభ్రపరచుకునే విధంగా పెద్దలు చూసుకోవాలి. ఉదయం లేవగాను ఒకసారి, పడుకునే ముందు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి.
- ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్ వంటివి అతి చల్లని పదార్థాలు తీసుకోవటం మానివేయాలి. అలాగే కాఫీ, టీ లాంటి అతి వేడైన పదార్థాలు కూడా తీసుకోకూడదు.
- పిల్లలకు బ్రష్సుల్లో హార్డ్ రకం బ్రష్షులను ఉపయోగించి ఎక్కువగా బలంగా తోమడం చేయకూడదు.
- పిల్లలు పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ తీసుకున్న వెంటనే నీరును పుక్కిలించి దంతాలను శుభ్రపరచుకునే విధంగా పెద్దలు చూడాలి.
మందులు.. చిగుళ్ళ, దంత సమస్య నివారణకు హోమియో వైద్యంలో మంచి మందులు ఉన్నాయి.
బెల్లడోనా: దంతాలు నొప్పిగా వుండి నమలడం కష్టంగా మారుతుంది. నొప్పి పంటి నుండి చెవిలోకి, గొంతులోకి, తల కణతలలోకి వ్యాపిస్తుంది. దీంతో నోరు తెరవాలనుకున్నా కష్టంగా మారుతుంది. ఇటువంటి లక్షణాలున్నపుడు పిల్లలకి ఈ మందు బాగా పనిచేస్తుంది.
మెర్కసాల్: చిగుళ్లు వాపుతో కూడి ఉండి రక్తం కారుతూ ఉంటుంది. అతి చల్లని- అతి వేడి పదార్థాలు తీసుకున్నపుడు దంతాలు జివ్వున లాగుతాయ. పంటి నొప్పి రాత్రి పూట ఎక్కువగా వుండి నిద్ర పట్టకపోవడం, ఇటువంటి లక్షణాలున్న పిల్లలకి ఈ మందు తప్పక ఆలోచించదగింది.
ప్లాంటాగో: చిగుళ్ళ, దంత సమస్యతో బాధపడే వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ మందు పంటి చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, వాపు తగ్గిపోతుంది.
క్రియోసోటినం: దంతాలు అతి త్వరగా ఇన్‌ఫెక్షన్స్ వల్ల పుచ్చిపోయి నోటి నుండి దుర్వాసన వస్తుంటే ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు. వీరు చల్లటి పదార్థాలు తీసుకొనినా దంతాలు జువ్వున లాగుతాయ. అలాగే పంటి చిగుళ్లు వాపుతో కూడి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలున్న పిల్లలకి ఈ మందును వాడి ఉపశమనం పొందవచ్చు.
ఈ మందులే కాకుండా హెపార్‌సల్ఫ్, కాఫియాక్రూడ, కామామిల్లా, స్పైజీలియా, మెగ్నీషియంఫాస్, సల్పర్, కాల్కేరియా ఫ్లోర్, మెడోరినం, తూజా, లైకోపోడియం ఫాస్పరస్ తదితర మందులను వాడవచ్చు.

- డా.పావుశెట్టి శ్రీధర్ 9440229646