హైదరాబాద్

వర్షంతో నేలకొరిగిన 210 చెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి 210 చెట్లు నేలకొరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుఝామున కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. అంతేగాక, వాటర్ వర్క్స్, విద్యుత్, జిహెచ్‌ఎంసి, ఫైర్ సర్వీసులు, ట్రాఫిక్ ఇతర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కూలిన చెట్లను తొలగించటం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించటం, నిలిచిన నీటిని తోడివేయటం వంటి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ఆబిడ్స్, సుల్తాన్‌బజార్‌తో పాటు సౌత్ జోన్ పరిధిలోని మలక్‌పేట, ఇమ్లిబన్ పార్కు, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో దాదాపు నాలుగు గంటల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల వల్ల మొత్తం 210 చెట్లు కూలగా, సాయంత్రం వరకు అన్నింటినీ రోడ్లపై నుంచి పూర్తిగా తొలగించామని చెప్పారు. సౌత్ జోన్ పరిధిలో అధికంగా 70ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. నూర్‌ఖాన్ బజార్‌లో రెండు చోట్ల చెట్లు కూలి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై కూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. వీటిని తొలగించామని వివరించారు. వీటితో పాటు నాలుగు చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా కూలాయని వివరించారు. సెంట్రల్ జోన్ పరిధిలో కూడా దాదాపు 70 చెట్లు కూలగా, వాటిని తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా బాగ్‌లింగంపల్లి, ఆబిడ్స్, ఎన్టీఆర్ నివాసం ఎదురుగా, రాంనగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయని తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్డులో చెట్లు కూలటంతో ప్రధాన రహదారిపై తీవ్రంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఎమర్జెన్సీ బృందాలు ఈ చెట్ల కొమ్మలను తొలగించాయని కమిషనర్ తెలిపారు. అలాగే ఈస్ట్‌జోన్‌లో కూడా మరో 14 చెట్లు కూలినట్లు తెలిపారు. 19 ప్రాంతాల్లో ఎక్కువగా నీరు చేరటంతో వీటిని తోడివేసినట్లు తెలిపారు. సౌత్‌జోన్‌లో 55, వెస్ట్‌జోన్‌లో 5 చెట్లు కూలగా, అన్నింటిని తొలగించామని తెలిపారు. అప్పటికపుడు తమ బృందాలు స్పందించినందుకు వర్షంతో ఏర్పడే నష్టాన్ని చాలా వరకు తగ్గించామని కమిషనర్ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.