హైదరాబాద్

చినుకు పడితే అన్నీ చిక్కులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: పేరుకే మహానగరం..చినుకు పడితే చాలు అన్నీ చిక్కులే. చిన్నపాటి వర్షానికి సైతం రహదార్లు గోదార్లుగా మారుతున్నాయి. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఇందుకు శనివారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షంతో తలెత్తిన కష్టాలే నిదర్శనం. విపత్తుల నివారణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రాత్రిపూట చిన్నపాటి వర్షం పడినా, రోడ్లపై ఎక్కువ మోతాదులో నీళ్లు ఆగినా కనీస సహాయక చర్యలు పత్తాలేకుండా పోయాయి. అర్థరాత్రి ఏ విపత్తు జరిగినా, అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు పత్తాలేకుండా పోయాయి. శనివారం రాత్రి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు కురిసిన వర్షానికి నగరంలోని సికిందరాబాద్ బసేరా హోటల్, నాగదేవత దేవాలయం, వైస్రాయ్ హోటల్, పంజాగుట్ట, రెడ్‌హిల్స్, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో నేలకొరిగిన మహావృక్షాలను ఆదివారం సాయంత్రం వరకు తొలగించలేదంటే వర్షం సహాయక చర్యలు ఏ మాత్రం చేపడుతున్నారో అంచనా వేసుకోవచ్చు. నాగదేవత దేవాలయం ముందు, వైస్రాయ్ హోటల్ చౌరస్తాలో ఇరువైపులా రెండు వృక్షాలు విరిగిపడినా, ఆ చెట్టు కొమ్మలను ఇంకా తొలగించలేదు. ఈ రూట్‌లో ఆర్టీసి బస్సు ప్రయాణించేందుకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హోటల్ బసేరా ముందు చెట్టు రోడ్డుపై విరిగిపడటంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్‌ను పక్క నుంచి అనుమతించి, అదే రోజు రాత్రి ఆ చెట్టు కొమ్మలను అక్కడి నుంచి తొలగించారు. మిగిలిన చోట్ల అధికారులకు ఇంకా చెట్లు విరిగిపడిన సమాచారం కూడా తెలియకపోవటం గమనార్హం. పైగా ఈసారి వర్షాలు మరింత గట్టిగా కొట్టే అవకాశముందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో స్పందించిన జిహెచ్‌ఎంసి 31 వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడైనా విద్యుత్ తీగల తెగి పడినా, చెట్లు నేలకొరిగి వాహనరాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తున్నా, ప్రజలు ఫిర్యాదులు చేసినా, అధికారులు స్పందించటం లేదు. పైగా విపత్తుల నివారణ కోసం ఏర్పాటైన కమిటీలో 31 ప్రభుత్వ శాఖల సమాచారం హైదరాబాద్ కన్వర్జెన్సీ పోర్టల్‌లో అలాగే, వర్షం కురిసినపుడు సంభవించే విపత్తులపై వెంటనే స్పందించేందుకు ఆయా ప్రభుత్వ శాఖలతో ప్రత్యేక వాట్సప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించినా, నేటికీ అతీగతీలేదు. నాగమయ్యకుంట, మల్లేపల్లి, టోలీచౌకి సమీపంలోని నదీంకాలనీ వంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు చినుకుపడిందంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలు కూడా ఎపుడు కూలుతాయో తెలియని పరిస్థితులున్నాయి. గతంలో నారాయణగూడలో, అలాగే సికిందరాబాద్ సిటీలైట్ హోటల్ భవనాలు కూలి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాతకాలపు భవనాలను గుర్తిస్తామని, వాటిని కూల్చివేస్తామంటూ అధికారులు ఆర్భాటపు ప్రకటనలో చేస్తున్నారే తప్పా, ప్రజలకెలాంటి ముప్పు ఏర్పడక ముందు తమ విధులు నిర్వర్తించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రతి వర్షాకాలంలో ప్రజలకు వానాకాలం కష్టాలను తగ్గించేందుకు తాము సిద్ధమేనంటూ ప్రకటనలో చేసే అధికారులు ఈ సారి కాస్త ముందుగా స్పందించారనుకుంటే అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఓ మోస్తరు కురిసి వర్షం ఆగినా, పలు ప్రాంతాల్లో తెల్లవారుఝాము వరకు కనీసం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించ లేదంటే అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారో గమనించవచ్చు.