హైదరాబాద్

ఉత్కంఠ రేపుతున్న కంటోనె్మంట్ రోడ్ల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, మే 15: కంటోనె్మంట్ నుంచి మల్కాజిగిరి - కాప్రా ప్రాంతాలకు వెళ్లే మార్గాలను మిలటరీ అధికారులు మూసి వేయటానికి గడువు దగ్గర పడుతున్నా కొద్ది ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వం ఎరకమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఆందోళనకు గురగుతున్నారు. టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యుల బృందం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి యథాస్థితిని కొనసాగించాలని విఙ్ఞప్తిచేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి కెటి రామరావు, కేంద్ర మంత్రికి ఈ అంశంపైన జోక్యం చేసుకోవాలని, ప్రత్యమ్నాయ రోడ్లకు దారి చూపి పనులు పూర్తి అయ్యే వరకు రోడ్లను యథాస్థితి కొనసాగించాలని కోరారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రాత్రి పది గంటల నుంచి తెల్లవారుఝాము ఆరు గంటల వరకు రోడ్లు మూసిస్తున్నారు. నిబంధనను తొలిగించి ప్రయాణం చేసేందుకు వీలు కల్పించాలని స్థానికులు కోరగా భద్రత దృష్ట్య సాధ్యపడదని మిలటరీ అధికారులు చెబుతున్నారు. మల్కాజిగిరి, సఫిల్‌గుడ, అనంద్‌బాగ్, వౌలాలి, హౌసింగ్ బోర్డు, ఇసిఐఎల్, కాప్రా, చర్లపల్లి, నాగారం, ఎఎస్‌రావునగర్, సాకేత్, నెరేమెట్, వాయుపురి, డిఫెన్స్‌కాలనీ, వినాయకనగర్, రామకృష్ణపురంతో పాటు మల్కాజిగిరి, కాప్రా మన్సిపల్ ప్రాంతంతోపాటు కీసర, బండ్లగుడ ప్రాంతవాసులు కంటోనె్మంట్‌లోని మిలటరీ రోడ్లు ద్వారనే ప్రయాణం చేస్తున్నారు. ఈ మార్గం మూసివేస్తే ఆయా ప్రాంతవాసులు నగరానికి చేరుకోవాలంటే మరో దగ్గరి మార్గం లేదు.మల్కాజిగిరి ప్రాంతవాసులను మెట్టుగుడ మీదుగా, కాప్రా ప్రాంతవాసులను రామకృష్ణపురం మీదుగా కాకుండా నర్మల్‌నగర్ ద్వార మిలటరీ ప్రాంతం నుంచి బొల్లారంలోని రాష్టప్రతి నిలయం మీదుగా లోతుకుంట నుంచి రాజీవ్ రహదారికి చేరుకోవాలి కానీ, ఇక్కడ మళ్లీ మిలటరీ ప్రాంతం అడ్డు వస్తుంది. హైకోర్డు మాత్రం ఇక్కడి ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నయ రోడ్డు వసతి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నా స్థలం కేటాయించటంలో అధికారులు విఫలమయ్యారు.
నేడు కంటోనె్మంట్ బోర్డు సభ్యులను కలువనున్న జెఎసి
కంటోనె్మంట్‌లో రోడ్ల మూసివేత అంశంపైన జెఎసి నాయకులు కంటోనె్మంట్ బోర్డు అధికారులను, బోర్డు పాలక మండలి సభ్యులను కలువనున్నారు. రోడ్లు మూసి వేయడానికి మరో 15రోజుల గడువు ఉంది. మే 30న రాత్రి నుంచి ప్రస్తుతం వదులుతున్న రోడ్లు మూసివేసి ఎలాంటి ప్రయాణాలను మిలటరీ అధికారులు అనుమతించరు.