జాతీయ వార్తలు

సభలో అసహనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార, విపక్ష సభ్యుల వాగ్యుద్ధం
రాజ్‌నాథ్‌పై సిపిఎం వివాదాస్పద వ్యాఖ్యలు
క్షమాపణకు పట్టుబట్టిన అధికార పక్షం
లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఊహించినట్టే అసహనంపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టగానే ప్రభుత్వంపై విపక్షాలు దాడికి దిగాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ‘హిందూ నాయకుడి’గా సంబోధిస్తూ సిపిఎం సభ్యుడు మొహమ్మద్ సలీమ్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని రేపాయి. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తి సభ పదేపదే వాయిదా పడింది. సభలో తొలుత ఈ అంశంపై చర్చను ప్రారంభించిన సలీమ్ ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్‌పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సలీమ్ ఉపసంహరించుకోవాలని లేదా క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేయడంతో ప్రష్ఠంభన ఏర్పడి సభ నాలుగుసార్లు వాయిదా పడింది. అయితే ఆరోపణలకు సంబంధించిన వ్యాఖ్యలను స్పీకర్ సుమిత్రా మహాజన్ రికార్డుల నుంచి తొలగించడంతో సాయంత్రానికి ప్రతిష్ఠంభన తొలగి చర్చ పునరుద్ధరణకు మార్గం సుగమైంది. బిజెపి నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోయిందని సిపిఎం, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు చర్చలో సర్కారుపై విమర్శలు గుప్పించడంతో అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. దేశంలో అసహనం పెరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఉదాహరణగా చూపుతున్న ఘటనలు కొత్తవేమీ కాదని, ఎన్నో దశాబ్దాల నుంచే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని బిజెపి పేర్కొంది. గత ఏడాది ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో చోటుచేసుకున్న మతపరమైన హింసాత్మక ఘటనలపై హోంమంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలను బిజెపి సభ్యురాలు మీనాక్షీ లేఖీ ఈ సందర్భంగా సభలో ప్రస్తావించారు.
అంతకుముందు చర్చలో సిపిఎం సభ్యుడు సలీమ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ గత ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తనను తాను ‘హిందూ నాయకుడి’గా ప్రకటించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అంతర్గత సమావేశంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒక పత్రిక వెల్లడించిందని సలీమ్ చెప్పారు. అయితే ఈ ఆరోపణను రాజ్‌నాథ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానంలో తాను ఇంతకుముందెన్నడూ ఇంతగా బాధపడలేదని ఆయన తెలిపారు. ‘సలీమ్ తీవ్రమైన ఆరోపణ చేయడం నన్ను ఎంతగానో బాధించింది. ఇటువంటి ప్రకటన చేసిన ఏ హోంమంత్రికీ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. కానీ నేను ఎప్పుడు, ఎక్కడ ఆవిధంగా ప్రకటించుకున్నానో సలీమ్ చెప్పాలి. నేను ఎప్పుడూ అటువంటి ప్రకటన చేయనని ప్రజలకు బాగా తెలుసు’ అని రాజ్‌నాథ్ అన్నారు. (చిత్రం) అసహనంపై లోక్‌సభలో దుమారం రేపుతున్న విపక్షాల సభ్యులు