జాతీయ వార్తలు

రాష్ట్రానికి అదనంగా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణకు 45వేల217 కేటాయింపు కేంద్ర పథకంగా మంజూరు

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తెలంగాణలోని 19 నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న ఇబిసిలకు 45వేల 217 ఇళ్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం తనవంతు సాయంగా 678కోట్ల రూపాయలు అందిస్తుంది. ఇంతకుముందు కేంద్రం తెలంగాణకు మంజూరు చేసిన ఇళ్లను జోడిస్తే మొత్తం 55వేల 507 ఇళ్లతోపాటు 833 కోట్లు సాయం లభించింది. తెలంగాణలో ఇళ్లకు ఏర్పడిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని అందరికీ అందుబాటులో ఉండే ఇళ్ల కేటాయింపును పెంచాల్సిందిగా కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చాలాకాలంగా పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధితోపాటు తెలంగాణలోని ఇతర పట్టణాలు, నగరాల్లో చేపట్టాల్సిన గృహ నిర్మాణాలపై ఆయన వెంకయ్య దృష్టికి తీసుకొస్తున్నారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకయ్య సోమవారం జరిగిన సమావేశంలో 45217 ఇళ్లకు అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణకు పెద్ద సంఖ్యలో ఇళ్లు కేటాయించినందుకు బండారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మరో 31 పథకాలను మంజూరు చేయాల్సిందిగా వెంకయ్యకు సూచించినట్లు బండారు వెల్లడించారు.
కేటాయింపుల వివరాలు
హైదరాబాద్‌కు 29531, కరీంనగర్‌కు 1038, భువనగిరికి 324, గజ్వేల్‌కు 1842, జనగాంకు 800, బోధన్‌కు 231, జహీరాబాద్‌కు 400, నాగర్‌కర్నూల్‌కు 250, మెదక్‌కు 253, పాల్వంచకు 1903, వికారాబాద్‌కు 291, వనపర్తికి 592, నల్లగొండకు 406, సిరిసిల్లకు 1680, అచ్చంపేటకు 500, మెట్‌పల్లికి 1250, మహబూబాబాద్‌కు 800, నిర్మల్‌కు 500, ఆర్మూర్‌కు 500 ఇళ్లు మంజూరు చేశారు.