హైదరాబాద్

‘పోలియో’పై సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జూన్ 16: మహనగరంలో మళ్లీ పోలియో వైరస్ నిర్దారణ కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నాలాల్లోని వ్యాక్సిన్ల నుంచి ఈ వైరస్ వృద్ది చెందినట్లు ఇప్పటికే ఓ అభిప్రాయానికిన వచ్చిన అధికార యంత్రాంగం సర్కారు ఆదేశాల మేరకు పోలియోపై సమరం ప్రకటించింది. పోలియోపై ఆందోళన అవసరం లేదని చెబుతున్న అధికారులు, ముందుజాగ్రత్త చర్యగా ఆరువారాల వయస్సు గల చిన్నారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వేను అంబర్‌పేట, కంటోనె్మంట్, పాతబస్తీతో పాటు అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఓ నిర్ణయాన్ని తీసుకున్నా, ముందస్తు వ్యాధి నివారణ చర్యలను వేగవంతం చేశారు. నగరాన్ని 12 క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్‌కు ఓ ఉన్నతాధికారిని నోడల్ అధికారిగా నియమించారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇదివరకు నిర్వహించిన సర్వే ప్రకారం ఉన్న సుమారు 22లక్షల కుటుంబాల్లో ఆరు వారాల వయస్సు గల చిన్నారులను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్దమైంది. అన్ని ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన చిన్నారులను గుర్తించేందుకు సుమారు 6500 బృందాలను రంగంలో దింపారు. ఒక్కో బృందంలో అంగన్‌వాడి వర్కర్, మహిళా శిశు సంక్షేమ, మెప్మా, యూనిసెఫ్, ఆశావర్కరు, నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బందిని భాగస్వాములను చేస్తూ బృందాలను తయారు చేశారు. ఈ చిన్నారులను గుర్తించి కేంద్రానికి నివేదికలు పంపనున్నారు. ఆ తర్వాత గుర్తించిన చిన్నారులకు పోలియో నివారణలో భాగంగా ఇంజక్షన్లు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గాక, ప్రతి స్కూల్‌లో ఓ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి నర్సరీ, యూకెజి, ఎల్‌కేజితో పాటు ఆరేళ్ల వయస్సు కల్గిన చిన్నారులను గుర్తించి, వారికి ఈ నెల 17వ తర్వాత ఇంజక్షన్లు చేయాలని భావిస్తున్నారు. ఈ సర్వేలో బృందాలతో పాటు సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్లు 15 మంది, సీనియర్ పిహెచ్‌వోలు 15 మంది, వైద్యులు, సిబ్బందితో కలుపుకుని జిల్లా మెడికల్ సిబ్బంది మొత్తం పాల్గొననుంది. సర్వే పారదర్శకంగానూ, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా జరిగేందుకు వీలుగా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సభ్యులను భాగస్వాములను చేయాలన్నారు. వీరందరికి ఇప్పటికే ఈ నెల 14వ తేదీన ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు తెలిపారు. ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ మంది చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.