హైదరాబాద్

రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం జరిగిన రెండు చైన్‌స్నాచింగ్ సంఘటనలు మరువక ముందే గురువారం తుకారం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, మరో రెండు ప్రాంతాల్లోనూ చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. అడ్డగుట్టలోని ఓ కిరాణా షాపులో సరుకులు ఇస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. అయితే సదరు మహిళ మెడలోని గొలుసు నకిలీ బంగారముందని పోలీసులకు తెలిపింది. చిక్కడపల్లిలోని ఓ విద్యార్థిని మెడలోని తులం బంగారు గొలుసు, సికిందరాబాద్‌లోని మోండా మార్కెట్, ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ వృద్ధురాలి గొలుసులు దుండగులు లాక్కెళ్లిన ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. నేరాల అదుపునకు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించినా నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి చైన్‌స్నాచర్లు జైల్లో ఉండగా ప్రస్తుతం దొంగతనాలకు పాల్పడుతున్న గొలుసు దొంగలు ఎవరన్నది..పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.