హైదరాబాద్

శ్రద్ధగా చదువుకుంటే ఉన్నత శిఖరాల అధిరోహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, జూన్ 16: పిల్లలు బాల్యం నుండే చదువుపై శ్రద్ధ పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని బాలాజీనగర్ కార్పొరేటర్ పన్నాల కావ్యా హరీష్‌రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని వివేక్‌నగర్‌లోగల ఎంపిపి స్కూల్‌లో పిల్లలతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కావ్యాహరీష్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలందరూ శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని కోరారు. విద్యార్ధులు ఉన్నతమైన విద్యను అందించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలను తీసుకురావాల్సిందిగా సూచించారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో వివేక్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రవీందర్, సావిత్రి, ఉపాధ్యాయురాలు తులసి, ఎంఇఓ వెంకట్రావు, ధనుంజయ్, ప్రకాష్, సుమిత్ర, లక్ష్మి, శోభ, జగన్, ప్రభాకర్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ
చేవెళ్ల: ప్రతి ఒక్కరూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఈర్లపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బి.లక్ష్మీనారాయణ తెలిపారు. బడిబాట ముగింపు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలోగ్రామానికి చెందిన గోపురం శివశంకర్‌గౌడ్ అతని తల్లి లక్ష్మీ పేరు మీదిగా పిల్లలకు నోట్ పుస్తకాలను అందజేశారు. బడిబాట కార్యక్రమానికి గ్రామస్థులు పూర్తి స్థాయిలోసహకరించినట్లు చెప్పారు. ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియంలో 14 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు జి.శ్రీరాములు గౌడ్, బాలయ్య, సువర్ణ, ఎఎంసి చైర్మెన్ రాజు పాల్గొన్నారు.