హైదరాబాద్

చైన్‌స్నాచర్ల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, జూన్ 16: నగరంలో చైన్‌స్నాచర్లు విజృంభిస్తున్నారు. స్నాచింగ్‌లు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. గంట వ్యవధిలో మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నార్త్‌జోన్ పరిధిలోని గోపాలపురం, మహంకాళి, తుకారంగేట్ పోలీస్‌స్టేషన్లలో సంఘటనలు జరిగాయి. బుధవారం రాత్రి 8గంటల పాంతంలో గోపాలపురం పరిధిలోని న్యూబోయగూడకు చెందిన సరిత(57) ఇంటి నుంచి కిరాణాషాప్ వెళ్తుండగా గుర్తుతెలియన వ్యక్తులు వచ్చి ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే తుకారంగేట్ పరిధిలో లక్ష్మీ అనే మహిళ మెడలోంచి ఐదున్నర తులాల పుస్తెలతాడు లాక్కెళ్లారు. గురువారం తెల్లవారుఝామున మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓల్డ్‌బోయగూడకు చెందిన చంద్రకళ.. ఇంట్లోని చెత్తను పడేయడానికి బయటకు రావడంతో ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును గుర్తుతెలియన వ్యక్తులు లాక్కెళ్లారు. చైన్‌స్నాచింగ్ ముఠాను పట్టుకోవడానికి క్రైం సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.