హైదరాబాద్

సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: జిల్లాల వారిగా స్థానిక సమస్యల పరిష్కారంకోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని టిడిడి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో కార్యకర్తల వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్రజల అజెండా అనే నినాదంతో ప్రజాందోళనలు నిర్వహించడానికి వారం రోజుల్లో తగిని కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, పని చేసే కార్యకర్తలకు భవిష్యత్‌లో గుర్తింపు ఉంటుందని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం అంటూ హైదరాబాద్‌లో పరిశ్రమలను స్థాపిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇప్పటి వరకు జిల్లాలో ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుభాష్ యాదవ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్, టిఎన్‌ఎస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఉదయ్, మోహన్‌రెడ్డి, సూర్యప్రకాష్, అశోక్‌గౌడ్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.