హైదరాబాద్

నేటితో ముగియనున్న ‘సర్వే’ గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: నగరంలో మళ్లీ పోలియో వైరస్ నిర్ధారణ కావటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా వ్యాధి ప్రబలకుండా ముందుగా ఆరువారాల వయస్సు గల చిన్నారులను గుర్తించేందుకు చేపట్టిన సర్వే ఆశించిన స్థాయిలో సాగటం లేదు. ఈ సర్వేకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా సమీక్ష నిర్వహించారు. ఆజంపురా, డబీర్‌పురా, సీతాఫల్‌మండి, గరీబ్‌నగర్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కనీసం యాభై శాతం వరకు కూడా సర్వే పూర్తి కాలేదని గుర్తించిన కలెక్టర్, మెప్మాకు చెందిన సిబ్బంది సర్వే విధులకు హాజరుకాకపోవటం వల్లే తాము ఆశించిన స్థాయిలో సర్వే నిర్వహించలేకపోతున్నామని ఎస్సీహెచ్‌వోలు సమాధానం చెప్పారు. దీంతో కలెక్టర్ మెప్మా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మెప్మా సిబ్బంది పూర్తి స్థాయిలో సర్వే విధులకు హజరుకావాలని, గైర్హాజరైన ప్రాంతాల్లో వారి వివరాలను తనకు ఎప్పటికపుడు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణయించిన మేరకు సర్వే బృందంలో పాల్గొనాల్సిన వారిలో రిపోర్టు చేయని సిబ్బంది స్థానంలో నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు, జిహెచ్‌ఎంసి శానిటరీ సిబ్బంది ఇతరత్ర సిబ్బందిని నియమించి సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని ఆదేశించారు. మెప్మాతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో సిబ్బంది రాకపోవటం వల్ల సర్వే కాస్త నెమ్మదిగా సాగుతుందని, ఏదేమైనాప్పటికీ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి శనివారం కల్లా సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేసేందుకు ఇరుగుపొరుగు జిల్లాలైన నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డిల నుంచి వచ్చే ఏఎన్‌ఎంలకు వసతి తదితర ఏర్పాట్లు చూసుకోవాలని, అదే విధంగా ఏరియా ఆసుపత్రులన్ని తమ పరిధిల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లకు నోడల్ ఆసుపత్రులుగా వ్యవహారించాలని ఆయన సూచించారు. ఈ నెల 20 నుంచి పోలియో వ్యాక్సిన్ చిన్నారులకు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్య సంస్థ సర్విలెన్స్ అధికారి డా. అరుణ్, డిఎంహెచ్‌వో డా. వెంకటేశ్వరరావు, అదనపు డిఎంహెచ్‌వో డా. పద్మజ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆశ్రీత, ఎస్సీహెచ్‌వో పాల్గొన్నారు.