హైదరాబాద్

సిటీ ఆర్టీసి బస్సుల బాధ్యత బల్దియాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: మహానగరంలో ప్రతిరోజు ఒక చోట నుంచి మరో చోటకు రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి బస్సుల బాధ్యత ఇకపై బల్దియా చూసుకోనుంది. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో నగరంలోని సిటీ పరిధిలో రాకపోకలు సాగించే ఆర్టీసి బస్సుల బాధ్యతలను జిహెచ్‌ఎంసికి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేగాక, క్రాస్ సబ్సిడీ కింద రూ. 198 కోట్ల చెక్కును కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆర్టీసి అందజేశారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా అధికారం చేపట్టిన కెసిఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసి కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే! అందుకే సిటీలో రాకపోకలు సాగించే ఆర్టీసి బస్సుల నిర్వహణ భారాన్ని జిహెచ్‌ఎంసి భరించాలంటూ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఆయన ఏటా జిహెచ్‌ఎంసి ఆర్టీసి రూ. 250 కోట్లను చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే! ఇందులో ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి ఆర్టీసికి రూ 130 కోట్లను చెల్లించిన సంగతి తెలిసిందే! అయితే నష్టాన్ని ఏటా కొంత చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నపుడే సిటీ వరకు ఆర్టీసి బస్సుల బాధ్యతను మున్ముందు ప్రభుత్వం బల్దియాకే అప్పగిస్తుందా? అన్న అనుమానాలు ఇపుడు నిజమయ్యాయి.
ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి సుమారు ఏడు వేల మంది పర్మినెంటు ఉద్యోగులుండగా, దాదాపు 22వేల మంది ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో విభాగాధిపతులు, అదనపు కమిషనర్లు మినహా కీలకమైన విధులు ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అయితే వీరి సంఖ్య పెరగకపోగా, పర్మినెంటు ఉద్యోగుల సంఖ్య ప్రతి నెల పదుల సంఖ్యలో తగ్గుతూ వస్తోంది. కీలకమైన విభాగాల్లో సిబ్బంది అవసరమైనా, కొత్తగా నియామకాలేమీ జరగటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నగరంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయంటే టౌన్‌ప్లానింగ్ విభాగంలో తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవటమేనని అధికారులు బాహటంగానే చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పటికే పనిభారంతో అల్లాడిపోతున్న జిహెచ్‌ఎంసికి సిటీ ఆర్టీసి బస్సుల బాధ్యతను అప్పగించటంతో మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టయ్యింది
జిహెచ్‌ఎంసికి రవాణాపై పట్టు ఎంత?
మహానగర పాలక సంస్థకు రవాణా విభాగంపై ఎంత వరకు పట్టుంది? ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటీ ఆర్టీసి బస్సుల నిర్వహణ బాధ్యతను ఎలా నిర్వహిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రతిరోజు పోగవుతున్న సుమారు 4వేల మెట్రిక్ టన్నుల చెత్తను దాదాపు 900 వాహనాలతో చెత్త కుండీల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించిన సంగతి తెలిసిందే! అయితే చెత్త రవాణా విభాగంలో అవినీతి, అవకతవకలు, కుంభకోణాలు జరుగుతున్నాయంటూ ట్రాన్స్‌పోర్టు విభాగాన్ని సర్కిళ్లు, జోన్లవారీగా వికేంద్రీకరించిన జిహెచ్‌ఎంసికి వాహనాల మరమ్మతులపై అవగాహన లేక బిల్లులు నిర్థారించే బాధ్యతను ఆర్టీసి తీసుకోవాలని కోరగా, తమకు తగిన సిబ్బంది లేదంటూ తప్పించుకున్న ఆర్టీసి బాధ్యతలు బల్దియాపై వేయటంపై ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు ఏకంగా సిటీ ఆర్టీసి బల్దియాకు అప్పగించటంతో కార్పొరేషన్‌పై అదనపు బాధ్యతలు పడనున్నాయి.