హైదరాబాద్

ఆదాయం పెంపుపై బల్దియా దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: దేశంలోని గ్రేటర్ నగరాల్లో మొట్టమొదటి సారిగా రికార్డు స్థాయిలో ఆస్తిపన్నును వసూలు చేసుకుని ప్రదాన నరేంద్రమోదిచే భేష్ అన్పించుకుంది జిహెచ్‌ఎంసి. కానీ ఖజానా ఎంత వేగంగా నిండిందో అంతకన్నా వేగంగా ఖాళీ అయ్యే అవకాశాలను కాస్త ముందుగానే గుర్తించిన జిహెచ్‌ఎంసి అధికారులు ఇప్పటి నుంచే ఆదాయం పెంపుపై దృష్టి సారించారు. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవటంలో సఫలీకృతులవుతున్నారు. ఇందులో భాగంగానే రూ. లక్షకు పైగా ఆస్తిపన్ను చెల్లిస్తున్న వాణిజ్య భవనాల ఆస్తిపన్నును మరో సారి రీ అసెస్‌మెంట్ చేయటంతో ఆదాయం పెరిగింది. ఈ రకమైన భవనాలు నగరంలో సుమారు 11వేల 108 వరకున్నాయి. వీటిలో ఒకే రోజు సిబ్బంది 732 భవనాలను పరిశీలించగా, అదనంగా రూ. 11.76 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్టు తేల్చారు. ఈ లెక్కన మొత్తం 11వేల 108 భవనాల నుంచి దాదాపు రూ. 150 కోట్ల వరకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశముంది. అలాగే రూ.లక్ష లోపు పన్ను చెల్లిస్తున్న నిర్మాణాల్లో సర్కిల్‌కు వంద చొప్పున నిర్మాణాలను పరిశీలించాలని కమిషనర్ రెండురోజుల క్రితం ఆదేశించారు. ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకునేందుకే జిహెచ్‌ఎంసి మరో సారి ఈ సునామీ సర్వే నిర్వహించేందుకు సిద్దమైందని చెప్పవచ్చు. అంతేగాక, రూ. 1200 ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి సిఎం రూ. 101కు కుదించిన సంగతి తెలిసిందే! ఈ ఖాతాల్లో తొలి దశగా 500 ఖాతాలను కూడా పునఃపరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు.
‘పన్ను’ పరిధిలోకి ప్రతి భవనం
మహానగరంలో కొంతకాలం క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో సుమారు 22లక్షల వరకు నిర్మాణాలున్నాయన్న విషయం తేలిపోయింది. కానీ జిహెచ్‌ఎంసికి ఆస్తిపన్ను చెల్లిస్తుంది కేవలం 14.50 లక్షల పై చిలుకు భవనాలు మాత్రమే. ఈ క్రమంలో ఇంకా ఆస్తిపన్ను చెల్లింపు పరిధిలోకి రాని భవనాలను గుర్తించి, ప్రతి భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే అధికారులు ఈ సునామీ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇందుకు గాను కొత్తగా అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు తీసుకున్న భవనాల వివరాలతో ఆ నిర్మాణాలకు ఆస్తిపన్నును వర్తింపజేస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా నిర్మితమై బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం కింద క్రమబద్ధీకరణకు వచ్చిన వివరాలను వినియోగించి, వీటిని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నా, ఈ అంశంపై కోర్టు పరిధిలో ఉన్నందున నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.