హైదరాబాద్

నగరంలో అమెరికన్ ఫుట్‌బాల్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జూన్ 17: హైదరాబాద్ నగరం అమెరికన్ ఫుట్‌బాల్ అంతర్జాతీయ మ్యాచ్‌కి వేదిక కానుంది. అమెరికన్ ఫుట్‌బాల్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఫ్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడా వ్యాప్తి కోసం భాతర ధేశంలోని పలు నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను దేశ నలుములలో అండర్-15, 19 విభాగం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఏడు గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో భారత్-దుబాయ్ జట్ల మధ్య అమెరికన్ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మేరకు నిర్వాహకులు నగరంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఇరు జట్ల క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. శనివారం జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామరావు, క్రీడల మంత్రి పద్మారావుతో పాటు మేయర్ బొంతురామ్మోహన్ విచ్చేస్తారని ఎఫ్‌ఫ్‌ఐ సిఓఓ సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు జట్ల కోచ్‌లు ప్రవీణ్‌రెడ్డి, కిలేజోర్డాన్ పాల్గొన్నారు.