హైదరాబాద్

అందరికీ అందుబాటులో కంటోనె్మంట్ జనరల్ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూన్ 17: అందరికీ అందుబాటులో కంటోనె్మంట్ జనర్ ఆసుపత్రి ఉంటుందనీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఐదు కోట్ల రూపాలతో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రిని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కెటి రామరావుతో కలిసి ప్రారంభించారు. 1933లో కంటోనె్మంట్ ప్రాంతంలో రకరకాల రోగాల పడిన ప్రజలను అదుకోవటానికి నాటి బ్రిటీష్ పాలకులు ఇక్కడ జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. ఇదే అసుపత్రిని పునర్ నిర్మించటానికి 2005లో ప్రతి పాదనలు చేశారు. అన్నిరకాలైన అధునాతన వసతులు సోలార్ ఎఇడి విద్యుత్ సౌకర్యంతో ఆసుపత్రిని ఏర్పాటు చెయ్యటంతో కంటోనె్మంట్ బోర్డు పాలక మండలి సభ్యులను అభినందించారు. కంటోనె్మంట్ జనరల్ అసుపత్రికి బొల్లారం, అల్వాల్, మచ్చబొల్లారం, తుర్కపల్లి, శామీర్‌పేట, కౌకూర్, బాలాజీనగర్ ప్రాంత ప్రజలు వైద్యం కోసం వస్తారని బోర్డు అధికారులు వివరించారు. ప్రసూతి సౌకర్యంతోపాటు పురుషుల జనరల్ వార్డు, రెండు ఆపరేషన్ థియేటర్‌లు ఉన్నాయి. ప్రతి రోజు ఒపి, అత్యఅవసర వైద్య సదుపాయం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రికి తగిన పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం తేదీలు చాలా సార్లు వాయిదా పడుతూవచ్చాయి. చివరికి రోడ్ల అంశం తెరపైకి రావటంతో రక్షణ శాఖ మంత్రి రెండు రోజుల పర్యటన ఏర్పాటు చేసుకొని నగరానికి వచ్చారు. రెండవ రోజు హకీంపేటలోని జరిగే గ్రాజుఎట్ పరేడ్‌లో పాల్గొంటారు. మంత్రి పర్యటలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. కంటోనె్మంట్‌లో ప్రధానంగా అక్ట్రాయ్ -టోల్ టాక్స్, అక్రమ నిర్మాణాలపై కేసులు, మిలటరీ బంగళాలలో బినామీల వ్యాపారాలు నిర్వహించటం, పేదలు నివాసం ఉంటున్న బస్తీల స్థలాల మార్పిడి అంశాలపైన స్థానికులు వినతి పత్రాలు సమర్పించారు. కంటోనె్మంట్ బోర్డు ఉద్యోగులకు విధి నిర్వహణలో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వటంలేదని, హస్మత్‌పేటలో ఉన్న స్థలంలో సిబ్బందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రాలు సమర్పించారు. బొల్లారంలో సమావేశం అనంతం మిలటరీ అధికారులతో కలిసి మంత్రి పారికర్ కంటోనె్మంట్ రోడ్లను పరిశీలించారు.