హైదరాబాద్

తెలుగు విశ్వవిద్యాలయంలో విసికి వ్యతిరేకంగా నినాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థి వ్యతిరేక పోకడలను అవలంబిస్తున్నారని శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయ ఆవరణలో కొంతమంది విద్యార్థులు వైస్ చాన్సలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాటలు పాడారు. ఎంఫిల్, పిహెచ్‌డి నోటిఫికేషన్ ఇవ్వాలని నినాదాలు చేసారు. ఈ విషయమై వర్సిటీ ఉపాధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డిని వివరణ అడుగగా, అనవసర రాద్ధాంతం అంటూ తోసిపుచ్చారు. గతంలో ఎంఫిల్‌కు విలువ వుండేదని, పిహెచ్‌డి చేసేవారికి ఎంఫిల్ విద్యార్థులకు ప్రిఫరెన్స్ వుండేదని ఆయన అన్నారు. పిజి విద్యార్థులు నేరుగా పిహెచ్‌డి చేయవచ్చని నిబంధన రావడంతో ఎంఫిల్‌కు విలువ తగ్గిందని అది కనుమరుగైందని అన్నారు. ప్రస్తుతం ఆందోళన కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అలజడి అని అన్నారు. ఆంధ్రా తెలంగాణ ప్రాంతీయ భేదాలతో చిచ్చు పెడుతున్నారని అన్నారు. యుజిసి నియమాలను అనుసరించి బోధన జరుగుతుందని అన్నారు. విశ్వవిద్యాలయంలో ఆంధ్ర నాట్యం పేరుతోనే బోధన, పరీక్షలు జరుగుతున్నాయని కొందరు తెలంగాణ వాదులు ఆంధ్ర అనే పదం వాడటం ఇష్టం లేక పేరిణిలాస్యం అని అంటున్నారని, అధికారికంగా ఆ పదం విశ్వవిద్యాలయంలో లేదని శివారెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అవసరమైనంత అధ్యాపకులు లేరనీ, కేవలం 40 శాతం మాత్రమే వున్నారని అన్నారు. రాష్ట్రాలు వేరుపడిన తరువాత సిబ్బంది వెళ్లిపోయారని, కొత్తవారిని నియమించడానికి అనుమతి లేదన్నారు. కొత్త కోర్సులు ప్రకటించినా బోధించడానికి అధ్యాపకులు లేరని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోకుండా వర్సిటీ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఎల్లవేళలా తమ సహకారం, ప్రోత్సాహం వుంటుందన్నారు. కళలకు ప్రాంతీయ భేదాలు వుండకూడదని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని సకల కళల కళామతల్లిగా చూసుకోవాలని, విభేదాలు, అసూయలు వలదని విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు.