హైదరాబాద్

నేషనల్ ఉమెన్ పాలసీ 2016పై 22న సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, జూన్ 17: ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నేషనల్ ఉమెన్ పాలసీ 2016’ పై ఈ నెల 22న సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ డా. త్రిపురాన వెంకటరత్నం వెల్లడించారు. బుద్ధ్భవన్‌లోని కమీషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగపరంగా మహిళల హక్కులు, వారి సంక్షేమానికి విడుదల చేయాల్సిన నిధులు, ప్రాధాన్యత వంటి అంశాలపై ఈ సదస్సులో పలు పౌర సంఘాలు, న్యాయనిపుణులు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మహిళా సంఘాల అభిప్రాయాలు,సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుద్దుచేరి రాష్ట్రాలకు చెందిన మహిళా కమీషన్ల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో మహిళలకు ఆరోగ్యభద్రత, పౌష్టికాహారం , విద్య, ఆర్థిక స్థితిగతులు, మహిళపై జరుగుతున్న అత్యాచారాల నివారణ వంటి అంశాల ప్రాతిపదికన చర్చించనున్నట్లు తెలిపారు. బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌లో జరిగే ఈ సదస్సు మొత్తం అయిదు సెషన్లుగా, వివిధ అంశాలపై నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సదస్సులో చేసే తీర్మానాలు, తీసుకునే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు వెంకటరత్నం వివరించారు.