హైదరాబాద్

మమ్మల్ని పట్టించుకోవటం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: మహానగర పాలక సంస్థ పాలక మండలి సమావేశాల నిర్వహణపై కొత్త కార్పొరేటర్లు అలక వహిస్తున్నారు. మొట్టమొదటి సారిగా ఆయా డివిజన్ల నుంచి గెలిచి కౌన్సిల్‌కు వచ్చిన కొత్త కార్పొరేటర్లకు కౌన్సిల్‌లో మాట్లాడే అవకాశమివ్వటం లేదని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కొత్త వారికి మాట్లాడే అవకాశమివ్వలేదని నగర శివార్లకు చెందిన కొందరు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి కార్పొరేటర్ల నుంచి మొత్తం 38 ప్రశ్నలు రాగా, వీటిలో మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశం మేరకు అధికారులు 16 ప్రశ్నలను ఎంపిక చేశారు. ఇందులో మాజీ మేయర్, మెహిదీపట్నం మజ్లిస్ కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్ 12 ప్రశ్నలు సమర్పించగా, అందులో ఆయన ఒక్కరివే ఎనిమిది ప్రశ్నలను ఎంపిక చేయటం పట్ల టిఆర్‌ఎస్ పార్టీ శివార్లలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు వాపోతున్నారు. కౌన్సిల్‌కు ప్రశ్నలను ఎంపిక చేయాల్సిన తుది అధికారం మేయర్‌కు ఉందని, అయితే కొందరు సభ్యులు మొత్తం నగరానికి సంబంధించిన సమస్యలు కాకుండా, తమ డివిజన్లకు సంబంధించిన సమస్యలు సమర్పించినందుకు వాటిని కౌన్సిల్‌కు ఎంపిక చేయకపోయి ఉండవచ్చునని సంబంధిత అధికారులు సమాధానమిస్తున్నారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన గంటన్నర వరకు కూడా ఒక్క మహిళా కార్పొరేటర్‌కు అవకాశమివ్వలేదని, చివరకు అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి జోక్యం చేసుకుని మహిళా కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశమివ్వరా? అన్ని ప్రశ్నించటంతో మేయర్ సరితారెడ్డి, విజయారెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి, గరిగంటి శ్రీదేవిలకు మాట్లాడే అవకాశమిచ్చారు. మజ్లిస్ పార్టీ అధికార పార్టీకి ఎంత అవగాహనపరమైన ఒప్పందం ఉంటే మాత్రం ఒకే సభ్యుడివి ఎనిమిది ప్రశ్నలు అనుమతించటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కానీ కొత్తగా పాలక మండలికి మొదటి సారిగా ఎన్నికైన వచ్చిన కార్పొరేటర్లు, అందులో మహిళా కార్పొరేటర్లలో ఎక్కువ మంది అనర్గళంగా తెలుగు, ఇంగ్లీషులో మాట్లాడే సత్తా ఉన్నా, ఎందుకు అవకాశమివ్వలేదని కొందరు కార్పొరేటర్లు వాపోతున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు సాగినా, అందులో మహిళా కార్పొరేటర్లకు చాలా తక్కువ సమయం కేటయించారని కూడా కొందరు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కౌన్సిల్‌లో సగం మంది మహిళలు ఉన్నందున, ఇతర కార్పొరేటర్లకు సమానంగా మహిళా కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం కల్పించాలని పలువురు కార్పొరేటర్లు కోరుతున్నారు.