హైదరాబాద్

4 నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, చార్మినార్, జూన్ 17: నమ్ముకునే వారి కొంగుబంగారం బల్కంపేటలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ప్రతి సంవత్సరం జూలై మాసంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించటం ఆనవాయితీ. అలాగే ఈ ఏట కూడా వచ్చే నెల 4వ తేదీ నుంచి మూడురోజుల పాటు జరగనున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు భారీ ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాయాసయాదవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలకు వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారి కళ్యా మహోత్సవానికి చుట్టుప్రక్కల ప్రజలతో పాటు తెలంగాణ పది జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని, ఎవరికెలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంతేగాక, ఉత్సవాలు జరిగే మూడురోజుల పాటు బల్కంపేట రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలను విధించాలని ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దేవాలయం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలతో పాటు తాగునీరు అందుబాటులో ఉంచాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేందుకు వీలుగా విద్యుత్ శాఖ అధికారులు జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎప్పటికపుడు శుభ్రపరిచేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయానికి దూరంగా తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని అర్ అండ్ బి ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. దేవాలయం చుట్టు పక్కలనున్న ఖాళీ స్థలాలను గుర్తించి, భక్తులకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అవసరమైన చోట్ల రోడ్లకు మరమ్మతులు, కిస్త చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వీది ధీపాలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ సభ్యులు, వాలంటీర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఇక్కడకి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేందుకు సహకరించాలని అధికారులను మంత్రి కోరారు.