హైదరాబాద్

విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: పాఠశాలలు మొదలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పట్టణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకంటె గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రెండు జిల్లాల యంత్రాంగాలతోపాటు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పష్టం చేసారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ రఘునందన్‌రావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పిల్లల తల్లిదండ్రులు ఇటీవల రెండు పాఠశాలల ముందు ఆందోళన చేసారన్న అంశాన్ని విలేకర్ల దృష్టికి తేగా ప్రత్యేక కారణాలతో అక్కడ వివాదం జరిగిందని, దానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసారు.
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో గొప్పగా పాఠాలు చెప్పడంలేదని అలాంటి పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమనే భావన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బడి బాట కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో వివిధ కారణాలతో బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలలకు తరలించే కార్యక్రమాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేసారు. ఉచితంగా మెరుగైన విద్యను అందించడంతోపాటు సాంఘిక సంక్షేమ వసతి గృహాల తరహాలో మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా రంగారెడ్డిలో 9, హైదరాబాద్ జిల్లాలో 7 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

రెండున్నర లక్షల మంది చిన్నారులకు పోలియో ఇంజెక్షన్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ అంబర్‌పేటలోని ఎస్‌టిపిలో గుర్తించిన పోలియో వైరస్‌కు ఉలిక్కిపడ్డ జిల్లా యంత్రాంగం వెంటనే నివారణ కార్యక్రమాలకు పూనుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలోని 23 క్లస్టర్లలో సమగ్ర సర్వేనిర్వహించి ఆరు వారాలనుండి 3 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులను గుర్తించి సుమారు రెండున్నర లక్షల చిన్నారులకు పోలియో నివారణ ఇంజెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 20 నుండి 6రోజులపాటు 23 క్లస్టర్లలో అన్ని ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు బూత్‌ల వారీగా పోలియో ఇంజెక్షన్లను ఇవ్వనున్నట్టు హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. హైదరాబాద్ జిలా లవైద్యాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంతవరకూ సర్వేలో 1లక్షా అరవై వేలమంది చిన్నారులను నగరంలో గుర్తించినట్లు తెలిపారు.