హైదరాబాద్

నేడు పబ్లిక్ గార్డెన్స్‌లో బ్రహ్మకుమారీల నేతృత్వంలో యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐదువేల మంది బ్రహ్మకుమారీలు ఆదివారం హైదరాబాద్‌లో సామూహిక యోగా ప్రదర్శిస్తారని సంస్థ ప్రతినిధి బికె సరళ తెలిపారు. శనివారం ఆమె ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, యోగా, ప్రాణాయామాన్ని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఐదువేల మంది బ్రహ్మకుమారీలతో సామూహిక యోగాను హైదరాబాద్ (పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లిహాలు ఎదుట పార్క్‌లో) లో ప్రదర్శిస్తున్నట్టు సరళ వివరించారు.

నటి విజయశాంతి ఇంట్లో
ఆభరణాల చోరీ

ఖైరతాబాద్, జూన్ 18: మాజీ ఎంపి, నటి విజయశాంతి ఇంట్లో ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలో నివాసం ఉండే విజయశాంతి ఇంటిలోని రెండవ అంతస్తులో భద్రపరిచిన డెమండ్ రింగ్, చెవిదిద్దులు అపహరణకు గురయ్యాయి. ఈ విషయమై ఆమె సోదరుడు ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంటి పని మనిషే చోరీకి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఆభరణాలను స్వాధీన పరచుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

చిరుజల్లులతో
చల్లబడ్డ వాతావరణం

హైదరాబాద్, జూన్ 18: మహానగరంలో శనివారం పలు దఫాలుగా చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం పూట ఓ మోస్తారుగా ఎండ కొట్టినా, మధ్యలో ఆకాశం మేఘావృతమవుతూ చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవగా, సాయంత్రం అయిదు గంటల సమయంలో ఓ మోస్తారు వర్షం పడింది. రాత్రి ఎనిమిది గంటలకు, రాత్రి పది గంటలకు కూడా ఓ మోస్తారు జల్లులు కురిశాయి. ఫలితంగా నగరంలో నిత్యం రద్ధీగా ఉండే పలు రాహదార్లలో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను తవ్వి వదిలేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా మెట్రోరైలు పనులు జరుగుతున్న ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, బేగంపేట, సికిందరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాలతో పాటు లోయర్ ట్యాంక్‌బండ్‌లో వైస్రాయ్ హోటల్ వద్ధ రోడ్డుకు ఒకవైపు తవ్వి వదిలేయటం వల్ల అటు గోశాల, ఇటు వైస్రాయ్ సిగ్నల్ వరకు సుమారు అరకిలోమీటరు వరకు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.