హైదరాబాద్

కఠిన చర్యలు మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: పర్యావరణానికి, మానవాళికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగం..బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయటం వంటి అంశాలపై కాస్త కఠినంగా వ్యవహారిస్తోంది జిహెచ్‌ఎంసి. ఇప్పటికే 50 మైక్రాన్లకు తగ్గిన ప్లాస్టిక్ బ్యాగ్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయటాన్ని నివారించేందుకు జరిమానాల వసూలుకు కూడా శ్రీకారం చుట్టింది. ఈ రెండు అంశాలపై గత కొద్దిరోజులుగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టిన జిహెచ్‌ఎంసి ఇక క్షేత్ర స్థాయిలో యాక్షన్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే 50 మైక్రాన్లకు తగ్గిన ప్లాస్టి బ్యాగ్‌లను వినియోగిస్తున్న వ్యాపారుల నుంచి గురువారం ఒకే రోజు రూ. 3లక్షలను వసూలు చేసింది. నగరంలోని అన్ని సర్కిళ్లలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ జరిమానాలను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల పెద్ద ఎత్తున నాలాలు, మురికినీటి కాలువలు జాం కావటంతో పలు సమస్యలు ఎదురవుతున్నందున 50 మైక్రాన్లకు తగ్గిన ప్లాస్టిక్ బ్యాగ్‌లను వాడరాదని అధికారులు సూచిస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, మార్పు రాకపోవటంతో క్షేత్ర స్థాయి జరిమానాలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందలో భాగంగా సర్కిల్ 12 శేరిలింగంపల్లిలో అత్యధికంగా 111 మ దికి రూ. 81వేల 950 జరిమానాలు వసూలు చేశారు. అలాగే సర్కిల్ 15లో 56 మంది వ్యాపారుల నుంచి రూ. 41వేల 800, 4బి సర్కిల్‌లో 20 మంది నుంచి రూ 30వేల 500, 4ఏలో రూ. 30వేల 500, సికిందరాబాద్ సర్కిల్ 18లో 73 మంది నుంచి రూ. 21వేల 900, ఎల్బీనగర్ సర్కిల్ 3బిలో 34 మంది నుంచి రూ. 10వేల 300, ఎల్బీనగర్ సర్కిల్ 3ఏలో 22 మంది నుంచి 9వేల 900, సర్కిల్ 6లో 26 మంది నుంచి రూ. 15వేల 200 వరకు కలిపి ఇతర సర్కిళ్లలోని పలువురు వ్యాపారుల నుంచి కలిపి మొత్తం రూ. 3లక్షల వరకు జరిమానాలను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
మాంసం దుకాణాల్లో తనిఖీ చేయండి
50 మైక్రాన్లకు తగ్గిన ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగాన్ని అడ్డుకునేందుకు గాను జిహెచ్‌ఎంసి వెటర్నరి విభాగం అధికారులు నగరంలోని మాంసం, చికెన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, నిషేధాన్ని ఉల్లంఘించే వ్యాపారులను గుర్తించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. సక్రమంగా ప్లాస్టిక్ వినియోగాన్ని అమలు చేయగలిగితే ప్రస్తుతం నగరంలో పోగవుతున్న చెత్తలో సుమారు 30 శాతం వరకు ఉంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తగ్గించుకోవచ్చునని వివరించారు. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రతి ఒక్కరూ విధిగా అమలు చేయాలని ఆయన సూచించారు.