హైదరాబాద్

26న సైబర్ సండే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలు నగర ప్రజల రోజువారి దినచర్యల్లో ఇంటర్నెట్ ఉపయోగం, ఆన్‌లైన్ సేవలతో ఉపయోగాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లాకర్ల ప్రాధాన్యత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిహెచ్‌ఎంసి కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ ఆదివారం రోజును సైబర్ సండేగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. కాప్రాలోని మీర్ పేట కమ్యూనిటీ హాల్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డినగర్, ఆడిటోరియం, శేరిలింగంపల్లి సర్కిల్‌లోని భాగ్యనగర్ వెల్ఫేర్ అసొసియేషన్, కుత్బుల్లాపూర్ సూరారం మార్కెట్ ఆర్యవైశ్య సంఘం, ఉప్పల్ ఇసినగర్ కమ్యూనిటీ హాల్‌లో 26న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు ఈ సైబర్ సండే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి స్థానికులు హజరైన జయప్రదం చేయాలని కూడా ఆయన కోరారు. జిహెచ్‌ఎంసి పరిధిలో డిజిటల్ లిటరసీ అంశంపై పదివేల మందికి అవగాహన కల్పించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోగా, ఇప్పటి వరకు 6వేల 57 మందికి ఈ శిక్షణ పూర్తయినట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 600 మందికి పైగా సర్ట్ఫికెట్లు కూడా జారీ చేశామన్నారు. డిజిటల్ లిటరసీలో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ డిజిటల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా కీ బోర్డు నిర్వహణ, గూగుల్ మ్యాప్‌ను గుర్తించటం, ఈ-మెయిల్ ఐడిలను క్రియేట్ చేయటం, ఫొటోలు, సమాచారాన్ని భద్రపర్చుకోవటానికి డిజిటల్ లాకర్లను క్రియేట్ చేయటం, ఈ-మెయిల్ చదవటం, తిరిగి రిప్లై పంపడం, ఆన్‌లైన్ ద్వారా వార్తాప్రతికలు చదవటం, రైల్వే సమాచారాన్ని తెల్సుకునేందుకు వీలుగా ఐఆర్‌సిటిసికి రిజిస్టర్ చేసుకోవటం, స్కైప్‌పై పూర్తి అవగాహన కల్పించటం, వికీపిడియా, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా సమాచారం తెల్సుకోవటం, ఆధార్ లింకు తదితర సమాచారాన్ని పొందటం తదితర అంశాలను ఈ డిజిటల్ లిటరసీ ప్రొగ్రాం ద్వారా కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన 28 ప్రాంతాల్లోని జిహెచ్‌ఎంసి కమ్యూనిటీ హాళ్లలో ఈ డిజిటల్ లిటరసీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.