హైదరాబాద్

రోడ్ల తవ్వకంపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: ఒకవైపు వర్షాకాలం..మరోవైపు మెట్రోరైలు పనులు చురుకుగా సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడబడితే అక్కడ రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వటంమే దృష్టి సారించింది సమన్వయ భేటీ. శనివారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సదరన్‌లో జరిగిన ఈ సమావేశంలో నగరానికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి పనులపై జిహెచ్‌ఎంసి, మెట్రోరైలు, విద్యుత్, జలమండలి, నగర ట్రాఫిక్ విభాగంతో పాటు ఇతర శాఖల అధికారులు చర్చించారు. సమావేశం అనంతరం జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎక్కడబడితే అక్కడ రోడ్లను తవ్వటంపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా రోడ్డు కట్టింగ్‌లకు అనుమతి ఇవ్వరాదని కమిషనర్ వివిధ విభాగాల అధికారులకు సూచించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల తవ్వకాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు, ప్రతి పని వద్ద పని వివరాలు, పూర్తయ్యే గడువు ఇతర వివరాలను తెలియజేసే బోర్డ్‌లను విధిగా ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. పనులు పూర్తి అయిన మెట్రో కారిడార్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, మీడియన్‌లను వెంటనే పునరుద్దరించాలని నిర్ణయించినట్లు కమిషనర్ వివరించారు. జిహెచ్‌ఎంసి శివారు ప్రాంతాల్లో రానున్న రెండు సంవత్సరాల్లో సుమారు రెండు వేల కోట్ల రూపాయల హడ్కో నిధులతో మెరుగైన మంచినీటి సరఫరా పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో దాదాపు 2700 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్‌లైన్ల నిర్మాణం కోసం చేపట్టనున్నామని, ఈ పనులన్నీ చేపట్టే మార్గాల సమాచారాన్ని వివిధ శాఖల ముందస్తు సమాచారాన్ని అందజేయాలన జలమండలిని ఆయన కోరారు. ఇదే సమాచారాన్ని స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు అందజేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్త రోడ్లను వేయటం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో స్థానిక పౌరులకు అవగాహన కల్పించవచ్చునని అన్నారు. మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయిన అనంతరం అన్ని విభాగాలకు సంబంధించి వివిధ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రజల ఇబ్బందులను తొలగే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రోడ్డు వేయటం, తిరిగి పైప్‌లైన్ నిర్మాణానికి తవ్వటం తదితర సమస్యలను అధిగమించే అవకాశముంటుందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 11న జిహెచ్‌ఎంసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఒకే రోజు 25లక్షల మొక్కలు నాటేందుకు చేపట్టనున్న హరితహరం కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ శాఖ కూడా భాగస్వామి కావాలని కమిషనర్ సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని కోరారు.
లబ్దిదారుల జాబితా ఇవ్వండి
పట్టణ పేదలకు పక్కా ఇళ్లను సమకూర్చాలన్న సంకల్పంతో గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన వాంబే, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్లు లబ్దిదారుల జాబితాను సమర్పించాలని కమిషనర్ తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ఇళ్లను వంటనే లబ్దిదారులకు అందజేయాలని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కెటిఆర్ కూడా ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ట్రాఫిక్ సమస్యపై విస్త్రృత చర్చ
నగరంలో రోజురోజుకి పెరిగుతున్న ట్రాఫిక్ సమస్యపై వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో విస్త్రృతంగా చర్చించారు. ముఖ్యంగా నగరంలో పార్కింగ్ సమస్య కూడా తీవ్ర రూపం దాల్చుతోందని, దీన్ని పరిష్కరించేందుకు నగరంలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను నగర ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీ స్థలాలను వెంటన గుర్తించాలని నిర్ణయించారు. ఈ అంశంపై వివిధ శాఖల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదిరినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగానే రూ. 16.68 కోట్ల వ్యయంతో 31 జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టగా, వీటిలో 11 జంక్షన్లలో పనులు పూర్తయ్యాయని, మరో 9 జంక్షన్ల పనులు పూర్తి కావల్సి ఉన్నాయని కమిషనర్ తెలిపారు. సాంకేతికపరమైన అనుమతులు, అగ్రిమెంట్ల స్థాయిలో మిగిలిన 17 పనులు ఉన్నట్లు ఆయన వివరించారు.