హైదరాబాద్

రాజ్‌భవన్ ముందు భవనం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు ఎదురుగా నిబంధనలకు విరుద్దంగా నిర్మితమవుతోన్న భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం కూల్చివేశారు. సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు ఎదురుగా ఉన్న మక్తాలో మల్లయ్య అనే వ్యక్తి ఇంటి నెంబరు 6-3-1240/135/ఏ గతంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. దీనికి సంబంధించి జిహెచ్‌ఎంసి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. పైగా ఇపుడు ఆ భవనంపై యజమాని మల్లయ్య మరో అంతస్తు అక్రమంగా నిర్మిస్తున్నాడు. అయితే రాజ్‌భవన్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న ఈ భవనం మరింత ఎత్తు నిర్మిస్తే భద్రత పరంగా అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించని రాజ్‌భవన్ సిబ్బంది జిహెచ్‌ఎంసికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దీంతో రంగంలో దిగిన సిబ్బంది శుక్రవారం ఈ భవనాన్ని కూల్చివేసినట్లు తెలిసింది. అయితే పేదల ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో భవనాల నిర్మాణ ఎత్తుపై అధికారికంగా ఎలాంటి ఆంక్షలేమీ లేకపోయినా జిహెచ్‌ఎంసి అధికారులెలా కూల్చివేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మోండా మార్కెట్‌లో మరొకటి
ఈ సారి వర్షాలు సాధారణంగా కన్నా అత్యధికంగా కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో ముందుజాగ్రత్త చర్యగా కొద్దిరోజులుగా జిహెచ్‌ఎంసి అధికారులు శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా సికిందరాబాద్ మోండా మార్కెట్ సమీపంలో ఓ పాతకాలపు భవనాన్ని సైతం కూల్చివేశారు.