హైదరాబాద్

ప్రభుత్వ వైఖరి మారకపోతే ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నాచారం, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఓయు టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఓయు ఔటా, నాన్ టీచింగ్ స్ట్ఫా ఆధ్వర్యంలో పరిపాలనా భవనం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ప్రతి నెల 1న ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన విశ్వవిద్యాలయం, ఈనెల చెల్లించకపోవడంతో ఉద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా ధర్నా నిర్వహించారు.
బంగారు తెలంగాణ అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతకడమే కష్టంగా మారిందని ఔటా అధ్యక్షుడు ప్రొ.్భట్టుసత్యనారాయణ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కనీసం జీతాలు ప్రతినెలా క్రమం తప్పకుండా అందేవని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ధనిక రాష్టమ్రని ప్రకటించినప్పటికీ కూడా కనీసం జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. ఒకవైపు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం యూనివర్సిటీల నుంచి పిజిలను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఓయుకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఇప్పటివరకు ఓయు పూర్తిస్థాయిలో వైస్‌చాన్స్‌లర్‌లను నియమించకుండా ఓయు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం వ్యవహరించడం చూస్తుంటే ఈ ప్రభుత్వ ఆలోచనా విధానం ఏంటన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోందని అన్నారు. వైస్‌చాన్స్‌లర్‌ను ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం ప్రకటించడం శోచనీయమని అన్నారు. అదే జరిగితే ఓయు లోని రెండు ప్రధాన ద్వారాలను మూసివేసి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, పరిశోధనలు నిర్వహించే ఓయులో ఐఏఎస్, ఐపిఎస్‌లు ఏమి చేస్తారని వారు మాత్రం జీతాలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాలను మార్చుకోవాలని వారు హితవుపలికారు. తమకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అనుకోలేమని తక్షణమే తమకు రావాల్సిన జీతాలను బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిందే తడవుగా ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేసే దిశగా తెరాస సర్కార్ అడుగులు వేయడం జరుగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యమాల గడ్డ ఉస్మానియావిశ్వవిద్యాలయంపై సిఎం కెసిఆర్ ఎందుకు శీతకన్ను వేస్తున్నారని నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ జీతాలను అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం నుంచి నిరవధికంగా ధర్నాను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోప్రో.పిఎల్. విశే్వశ్వర్‌రావు, నాన్‌టీచింగ్ తరుపున మనోహర్ తదితరులు పాల్గొన్నారు.