హైదరాబాద్

పోలీసులకు సవాల్‌గా మారిన చైన్‌స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: నగరం, శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెంబడించి దాడిచేసి తప్పించుకు తిరుగుతున్న చైన్ దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు సవాల్‌గా మారాయి.
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని బస్‌స్టేషన్లు, రద్ధీగా ఉన్న ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు గుర్తుతెలియని వాహనాలపై వచ్చి విలువైన బంగారు చైన్‌లను లాక్కెళ్తున్నారు. కొన్ని సందర్భాలలో ఇంటి ముందు ఉన్న మహిళల మెడలలోని గొలుసులు అపహరించిన సంఘటలు చోటు చేసుకున్నాయి. వీటిని సవాల్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయినప్పటికీ కొన్ని కేసులను పురోగతి సాధించలేకపోవడంతో చైన్ స్నాచర్లు మరిన్ని చోరీలకు పాల్పడుతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి వ్యూహ రచనలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. దీంతో చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
వరుస చోరీలు
* బెంబేలెత్తుతున్న ప్రజలు
హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మూడ్రోజుల క్రితం కూకట్‌పల్లి ప్రాంతంలో ఏడు ఇళ్లల్లో జరిగిన చోరీల సంఘటన మరువకముందే తాజాగా మల్కాజ్‌గిరి, ఎంజి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటాక దొంగలు హల్‌చల్ చేశారు. రెండు దుకాణా షట్టర్లు పగులగొట్టి విలువై వస్తువులను దోచుకెళ్లారు. కాలనీలోని సంహిత కిరాణ దుకాణ, మోబైల్ షాపుల్లో దొంగలు పడ్డారు. బియ్యం బస్తాలు, విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గమనించిన షాపు యజమానులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మరో ఘటన కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
3వ రోడ్డులోవని ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఏడు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇనె్స్పక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.