హైదరాబాద్

ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: మహానగరాన్ని మరింత ఆహ్లాదకరంగా, పచ్చదనంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలని కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంపై ఆయన సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు, జెఎన్‌టియు, సెంట్రల్ వర్శిటీల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసికి చెందిన నర్సరీల్లో దాదాపు 70 నుంచి 80 ఏరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమ కాలనీలు, వీధుల్లో మొక్కలు నాటడానికి ఆసక్తి కలిగిన వారు సమీపంలోని నర్సరీల్లో మొక్కలను పొందాలని సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాలు, వాటి సంరక్షణ తదితర వివరాలతో కూడిన లేఖలు అందజేయాలన్నారు. వెయ్యి మొక్కలు కన్నా అధికంగా కావల్సిన వారు జిహెచ్‌ఎంసి కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. నర్సరీల వివరాలు, అందుబాటులో ఉన్నమొక్కలు, నర్సరీల అధికారుల పేర్లను జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. హైదరాబద్ పరిధిలో నేటి ఉదయం వరకు 17లక్షల గుంతలను తవ్వటం జరిగిందని, ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు 103 సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. జిహెచ్‌ఎంసి నర్సరీలో ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మొక్కలు సిద్దంగా ఉన్నాయన్నారు. గుల్మోహర్ లాంటి మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీవవైవిధ్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను కూడా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు.