హైదరాబాద్

హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8న ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం సచివాలయం నుండి హరితహారం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనగా సిద్ధిపేట నుండి భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పాల్గొన్నారు. జెసి మాట్లాడుతూ జిల్లాలో 2.5 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని, బ్యాచింగ్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 12 లక్షల ఉధ్యానవన మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించగా జిల్లాలో ఆరు లక్షల మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగతా మొక్కలను ఇతర జిల్లాల నుండి సరఫరా చేయాలని కోరారు. 120 మిషన్ కాకతీయ చెరువు గట్లపై మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంఘాలు, విద్యార్థులు, యువత భాగస్వాములైతేనే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. జవహార్‌నగర్ డంప్ యార్డులో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హరితహారం ప్రత్యేక అధికారి శోభ, డ్వామా పిడి హరిత, అటవీ శాఖ అధికారులు నాగభూషణం, శ్రీనివాస్, ఆర్ అండ్‌బి ఎస్‌ఇ ఆశారాణి, ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, డిఇఓ రమేశ్, జెడ్పి సిఇఓ రమణారెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణి విజ్ఞప్తులను వెంటనే పరిష్కరిస్తాం
ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో భూసమస్యలు, పెన్షన్‌లు, రుణ మంజూరు తదితర అంశాల పై 97 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ట్రైనింగ్‌లకు జిల్లా కార్యాలయాల నుంచి జూనియన్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌లను ట్రైనింగ్‌కు పంపుటకు పూర్తి పేర్లను నమొదు చేసి పంపాలని, ట్రైనింగ్ తేది తెలియజేసినప్పుడు కార్యాలయ విధుల నుంచి రిలీవ్ చేసి పంపుటకు జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ పమేళ సత్పతి, డిఆర్‌ఓ ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ రమణారెడ్డి, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్‌రెడ్డి, సిపిఓ వైవి శర్మ పాల్గొన్నారు.