హైదరాబాద్

బొల్లారం అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూలై 4: నగరంలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం హత్య కేసులో నిందితుడు అనిల్‌ని అరెస్టు చేసి నిర్భయ కేసు పెట్టినట్లు నార్త్‌జోన్ డిసిపి సుమతి చెప్పారు. సోమవారం నార్త్ జోన్ డిసిపి కార్యాలంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడు చింతకింద అనిల్ ను ప్రవేశ పెట్టి నిందితునికి సంమందించిన నేర చరిత్ర వివరాలు తెలిపారు. నార్త్‌జోన్ పోలీస్ కార్యాలయంలో విలేఖరు సమావేశం జరుగుతున్నప్పుడే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెరెళ్ల శారద ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిసిపి సుమతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు అనిల్ జూలై 2న మచ్చబొల్లారంలోని శ్రావణ్ గౌడ్ నిర్వహిస్తున్న కల్లు కాంపౌండ్ వెళ్లి కల్లు తాగుతున్న సమయంలో అక్కడ ఉన్న 10 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి తిరుమలగిరి - అమ్ముగుడ ప్రాంతంలోని 1ఇఎంఇ పక్కనే ఉన్న కెవిలరీ బారెక్స్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న పోదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి బండరాయితో మోది హత్య చేసి పారిపోయాడనీ వివరించారు. గస్తీ తిరుగుతున్న మిలటరీ అధికారులు.. బాలిక మృతదేహాన్ని గమనించి బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారని, సిఐ మహేశ్వర్ కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. నిందితుడు అనిల్‌కు సుమారు 19 కేసులతో సంబంధం ఉందని, అందులో రెండు హత్య కేసులు, రెండు అత్యాచార కేసులు ఉన్నాయని వివరించారు. అనిల్‌పైన అల్వాల్ బోల్లారంతోపాటు మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని, ఉద్ధెశపూర్వకంగా నేరాలు చేస్తున్నాడనీ ఇతనిపైన అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో రౌడిషీట్ ఉందని చెప్పారు. బోల్లారంలో జరిగిన అత్యాచార ఘటనతో అతనిపై బాలకను కిడ్నాప్, అత్యాచారం, హత్యతోపాటు నిర్భయ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. విలేఖరుల సమావేశంలో ఏసిపి మురళీధర్ పాల్గొన్నారు. కాగ మైనర్ బాలికపై జరిగిన ఘటన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర మహిళ మండలి అధ్యక్షురాలు నెరెళ్ల శారద, కంటోనె్మంట్ బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీతో కలిసి బోల్లారం కళాసిగుడాలో బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. నార్త్ జోన్ పోలీస్ డిసిపి కార్యాలయం వద్ద ప్రెస్‌మీట్ జరుగుతుందని తెలుసుకొని అక్కడికి చేరుకొని నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు ధర్నాకు దిగారు. పోలీసులు కలుగ జేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సహకరించాలని కోరారు.

ఆంధ్రభూమి బ్యూరో