హైదరాబాద్

భావితరానికి ఆక్సిజన్.. వాయు కాలుష్యానికి చెక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: ఈ నెల 8నుండి రాష్టవ్య్రాప్తంగా ప్రారంభం కానున్న తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఒక ఉద్యమంలాగ చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు.తెలంగాణకు హరిత హారం పై మంత్రులు జోగురామన్న, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలతో కలిసి సోమవారం సచివాలయంనుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇండస్ట్రియల్ పార్కులు, మున్సిపల్ లే అవుట్లు, డంపింగ్ యార్డులు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. జూలై 11న జిహెచ్‌ఎంసి పరిధిలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలొ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లడుతూ జిల్లాలో 2154 కార్యాలయాలు, విద్యాసంస్థలను మొక్కలు నాటేందుకు వీలుగా గుర్తించినట్టు తెలిపారు. ఇందులో 674 ప్రభుత్వ పాఠశాలలు, 1399 ఎయిడెడ్ మరియుప్రైవేటు పాఠశాలలు, 35 జూనియర్ కళాశాలలు, పిహెచ్‌సిలు, హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు వున్నాయని అన్నారు. జులై 11న దాదాపు 50వేల మొక్కలను నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మండలాల పరిధిలో నాటబోయే మొక్కలకు సంబంధించి గుంతలు తవ్వడం తనిఖీ చేసి నివేదించాల్సిందిగా మండల తహశీల్దార్లను ఆదేశించినట్టు వివరించారు. ఈ సమావేశంలో ఇంచార్జి ఎజెసి అశోక్‌కుమార్, యువజన సంక్షేమాధికారి మోతీలాల్, డిఇఓ సోమిరెడ్డి, ఆర్‌ఐఓ రవికుమార్ పాల్గొన్నారు.