హైదరాబాద్

రాజ్యాంగాన్ని అమలుచేసే పాలకులతోనే సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 10: రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పాలకులకు కచ్చితంగా అమలుచేసినప్పుడే దేశంలో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కిషన్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లు గడుస్తున్నా రాజ్యాంగం సక్రమంగా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చివరకు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు సైతం అమలుకావడం లేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యనందించాల్సిన ప్రభుత్వాలు ఆ పని తమది కాదన్నట్టు వ్యవహరిస్తుండటంతో వారు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలను చదువుకు దూరంచేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే వివిధ కారణాలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని దుయ్యబట్టారు.
కేజీ టూ పీజీ విద్యనందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశించినా అవి అమలు కాకపోవడం ఎంతో దారుణమన్నారు. వీటన్నింటిపై పోరాడేందుకే తమ సంఘం పనిచేస్తుందని కిషన్ తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు కైలాశం, సంతోష్ నాయక్, విజయ్‌కుమార్, చిట్టిబాబు పాల్గొన్నారు.