హైదరాబాద్

బిసిల అభివృద్ధిపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రతాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిసిల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలపై శే్వతపత్రం విడుదల చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసి కార్పొరేషన్ - బిసి ఫెడరేషన్లు, బిసి గురుకులాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బిసి సంఘాల నాయకులు యాదగిరి, షేక్ సత్తార్ సాహెబ్, నారాయణ గౌడ్, వెంకన్న గౌడ్, బిక్షపతి, సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, రాజేందర్, స్వామి, రవిలతో పాటు విద్యార్థి నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జనాభాలో 52శాతానికి పైగా ఉన్నా బిసిలు అన్ని రంగాల్లో వివక్షతకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక సంఖ్య కలిగినా రాజ్యాధికారాన్ని అందుకోవడంలో వెనుకబడి పోవడంతో ఏ రంగంలో సక్రమంగా రాణించలేని దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా జనాభాలో అత్యల్ప శాతం ఉన్న వారే గద్దెనెక్కి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలాలైన బిసిలు అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావాల్సి ఉన్నా ఏ కోశానా అది అమలు కావడం లేదని, ప్రజాస్వామ్యానికి ముఖ్య స్తంభాలైన న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థల్లో కార్యనిర్వహణ రంగంలో కొద్దిపాటి రిజర్వేషన్లు దక్కుతున్నా మిగిలిన న్యాయవ్యవస్థ, చట్టసభల్లో బిసిలను రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల్లాగే కేసిఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రాజెక్టులకోసం కోటాను కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం బిసి బిడ్డల స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదల చేయమంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బిసి కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్లను ఫ్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాయని ఆరోపించారు. బిసి కార్పోరేషన్ క్రింద అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టిలో ముందున్న వారు దానిని అనుభవించడంలో వెనుకంజలో ఉండిపోతున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అనవసరంగా నిర్మించనున్న ప్రాజెక్టులు, భవనాలను పక్కన పెట్టి పాడైన బిసి హాస్టళ్లను మరమ్మతు చేయించడంతో పాటు నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విద్యాసంవత్సరంలోనే 500 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించి అందుబాటులోకి తేవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను గతంలో ఇచ్చిన హామీ మేరకు విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల పోరాటంతో వచ్చిన తెలంగాణలో దొరల పాలన కొనసాగతుండటంతో ఆయా వర్గాలు అణచివేతకు గురౌతున్నాయని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభాలో అధిక భాగం ఉన్న బిసిలు ఐక్యమై రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటేనే సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రమేష్, శ్రీనివాస్, రాజు గైడ్, మధుసూదన్ రావు, విక్రమ్‌గౌడ్ పాల్గొన్నారు.