హైదరాబాద్

సర్వే 57 భూమిపై ప్రభుత్వం దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, జూలై 17: బాలానగర్ మండలం శంషీగూడ గ్రామం సర్వే 57 ప్రభుత్వ భూమి అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ఇక్కడ భూములను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఎల్లమ్మబండలో ఫోర్త్ ఎస్టేట్ బాధితులు, 57 పరిరక్షణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వే 57 బాధితుల మహాగర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్, టియుఎఫ్ చైర్‌పర్సన్ విమలక్క, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి లోక్‌సత్తా బి.సాంబిరెడ్డి, హైకోర్టు న్యాయవాధి టి.కిష్టయ్య, సిపిఐ నాయకులు వెంకట్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్ యాదవ్ పాల్గొన్నారు. కొంత కాలం క్రితం ఫోర్త్ ఎస్టేట్‌కాలనీలో కబ్జాదారుల చేతిలో కూల్చబడిన పలు ఇళ్లను జస్టిస్ చంద్రకుమార్ పరిశీలించి వివరాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఉత్తర్వులలో స్టేటస్‌కో ఉండగా ఇళ్లు కూల్చడం తప్పని, తిరిగి వాటిని నిర్మించుకునేందుకు యజమానులకు అధికారం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా తెచ్చుకున్న డిక్రీలు మోసపూరితమవుతుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున పేద వారి ఇళ్లను ధ్వంసం చేస్తు దౌర్జన్యాలకు పాల్పడుతున్నపుడు ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. కిరాయి గుండాలు, రౌడీలు ఇళ్లు కూలుస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పుడు కలెక్టర్, ఆర్‌డిఓ, డిప్యూటీ కలెక్టర్లు, పోలీసు అధికారులు జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు న్యాయాన్యాయాలను అలోచించి చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దని చెప్పారు. అనేక తీర్పుల్లో సర్వేనెం.57 ప్రభుత్వ భూమిగా ఉందని, పోలీసులు ఏకపక్ష తీర్పులపై చర్యలు తీసుకోవడ తగదన్నారు. ఫోర్త్ ఎస్టేట్‌కాలనీలో జరుగుతున్నది సివిల్ వ్యవహారం అయినందున కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్పా పోలీసులు తలదూర్చేందుకు వీలులేదన్నారు. చట్టానికి అందరు సమానమేనని సివిల్ వ్యవహరాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరంగా వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎల్లమ్మబండ పరిసర ప్రాంతాల్లో ఉన్న బస్తీ వాసులు అందరూ ఐక్యంగా ఉండి తమ ఇళ్లను కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే సర్వేనెం.57పై దృష్టి సారించి స్థానిక వేలాది మంది ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఫోర్త్ ఎస్టేట్‌కాలనీకి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వౌలిక వసతులు కల్పించానని, సర్వే 57 అనేక మంది పేదలకు పట్టాలు ఇప్పించానని గుర్తుచేశారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న పేద ప్రజల ఇళ్లను కూల్చడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ధనార్జన, భూకబ్జాలే ముఖ్యమనే విధంగా టిఆర్‌ఎస్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు మాట్లాడుతూ సర్వే 57 ప్రభుత్వ భూములపై తప్పుడు పత్రాలు సృష్టించి, కోర్టును తప్పుదారి పట్టించి కొందరు ప్రైవేట్ వ్యక్తులు తెచ్చుకున్న డిక్రీలతో పేద ప్రజల ఇళ్లను దౌర్జన్యంగా కిరాయి గుండాలతో ఎలా కూల్చివేయిస్తారని ప్రశ్నించారు. సదరు వ్యక్తుల తప్పుడు పత్రాలపై కాకుండా సర్వే 57 ప్రభుత్వ భూమి కబ్జాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ వ్యవహారంలో తలదూర్చిన రెవెన్యూ అధికారుల అక్రమ సంపాదనపై దృష్టి సారించి వారి అవినీతి బాగోతాన్ని బయటపెట్టడానికి తెలంగాణ లోక్‌సత్తా వెనుకాడేది లేదని హెచ్చరించారు. 100 ఎకరాల మేర ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి దానిని కాపాడుకోలేని అసమర్ధ స్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.
కబ్జాకు పాల్పడేవారు కూకట్‌పల్లి ఎమ్మెల్యే బినామీలు: విమలక్క
శంషీగూడ గ్రామం సర్వే 57లోని ప్రభుత్వ భూమిని కబ్జాలకు పాల్పడే వ్యక్తులు కూకట్‌పల్లి ఎమ్మెల్యే బినామీలని, ఎల్లమ్మబండ ప్రాంతంలో సదరు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వౌనం వహించడం సమంజసం కాదని టియుఎఫ్ చైర్‌పర్సన్ విమలక్క అన్నారు. సురేష్ అనే వ్యక్తి ద్వారా కిరాయి గుండాలను ఏర్పాటు చేసి పేద ప్రజల ఇళ్ల కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కెటిఆర్ సందర్శించి ఇచ్చిన ఆదేశాలను పోలీసులు, రెవెన్యూ అధికారులే పట్టించుకునేలా లేరని హేళన చేశారు. క్షేత్ర స్థాయిలో ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇంత విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతుండంగా ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. కిరాయి గుండాలు ముసుగులు ధరించి ఇళ్లు కూల్చివేస్తున్నారంటేనే ఇందులో ఏదో పెద్ద మోసం ఉందని గ్రహించాలన్నారు. సర్వే 57లో 70 ఎకరాల ఖాళీ స్థలం ఉందని అందులో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఎకళాకారులు నిర్వహించిన ధూందాం కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. హరితహారంలో భాగంగా స్థానికులతో కలిసి చంద్రకుమార్ మొక్కలను నాటారు. కార్యక్రమంలో 57 పరిరక్షణ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, ఆర్‌టిఎ కార్యకర్త పరుశురాం, ఫోర్త్ ఎస్టేట్ బాధితుల సంఘం నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రజా కళాకారులు దరువు అంజన్న, రచయిత బైరాగి, డప్పు రామస్వామి, ఫోర్త్ ఎస్టేట్‌కాలనీ బాధితులు నాయిని రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.