హైదరాబాద్

విధుల నిర్వహణలో అలసత్వం.. డిఎల్‌పిఓపై‘వేటు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలు, అధికారుల విధుల నిర్వహణలో అలసత్వం.. ఫిర్యాదులు వచ్చినా చూసీ చూడనట్లుగా వ్యవహరించే అధికారులపై వేటు వేసేందుకు జిల్లా పంచాయతీ శాఖ నడుం బిగించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో విస్తరించిన రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాలని భావించిన జిల్లా యంత్రాంగం ప్రక్షాళన చర్యలు మొదులుపెట్టింది. హరితహారం కార్యక్రమంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా యంత్రాంగం తూర్పు డివిజన్ పంచాయతీ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కీసర మండలం దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక అక్రమాలు జరిగాయని, అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలపై జిల్లా పంచాయతీ అధికారిణి అరుణ విచారణ జరిపి జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. దాని ఆధారంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిఎల్‌పిఓ మాజిద్‌తోపాటు మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ శాఖను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రాజకీయ జోక్యంతో ఎంతమేరకు సత్ఫలితాలు వస్తాయో ఎదురు చూడాల్సిందే.