హైదరాబాద్

డివిజన్ అధ్యక్షులు సైనికుల్లా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: భారతీయ జనతాపార్టీకి చెందిన నగరంలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంగళవారం బర్కత్‌పురాలోని పార్టీ ఆఫీసులో డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 2019లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజాసమస్యలపై నాయకులు ఎప్పటికపుడు ప్రజలతో మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత డివిజన్ అధ్యక్షులపైనే ఉందన్నారు. నగరంలో భారతీయ జనతాపార్టీ బలంగా ఉందని, నగరంలో రోజురోజుకి మజ్లిస్ పార్టీ ఆగడాలు పెరిగిపోతున్నాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను మరిచి, సొంత అజెండాతో ముందుకు సాగుతుందని విమర్శించారు. ప్రజల సమస్యలు తెల్సుకుని పరిష్కరించటంలో బిజెపి నేతలు ముందుండాలన్నారు. ఇందుకు గాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి సికిందరాబాద్ ఐడిహెచ్ కాలనీలో కొన్ని ఇళ్లను మాత్రమే నిర్మించి, వాటిని చూపించి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచారన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించలేదన్నారు.
రూ. 1200లోపున్న ఆస్తిపన్నును మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తలా తోకా లేని కారణాలను చూపుతూ ఆస్తిపన్నును రూ. రెండున్నర వేల నుంచి మూడు వేల వరకు పెంచుతూ మున్సిపల్ సిబ్బందిని ఇళ్ల వద్దకు పంపి, మళ్లీ కొలతలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి గాక, కేవలం ఒకే ఒక్క రూపాయికి మంచినీరు అందిస్తామన్న వాగ్దానం మరిచారని, మరొపక్క విద్యుత్ ఛార్జీలు పెంపుకు రంగం సిద్ధం చేశారన్నారు.
నేటి నుంచి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా చేపట్టనున్న సంతకాల సేకరణను ఈ నెల 25వరకు నిర్వహించి, ఆ తర్వాత ఆ సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
నేటి నుంచి సంతకాల సేకరణ
బుధవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉదయం చాదర్‌ఘాట్, మలక్‌పేట, యాకుత్‌పురాల్లో జరిగే కార్యక్రమాల్లో తానూ పాల్గొనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు. నాంపల్లిలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సనత్‌నగర్, కంటోనె్మంట్‌లలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, సికిందరాబాద్, జూబ్లీహిల్స్‌లలో ఎమ్మెల్యే కిషనరెడ్డి, ముషీరాబాద్‌లో బి. వెంకట్‌రెడ్డి, అంబర్‌పేటలో గౌతమ్, కార్వాన్‌లో వెంకటరమణి, బహద్దూర్‌పురాలో శ్యాంసుందర్‌గౌడ్, ఖైరతాబాద్‌లో బద్దం బాల్‌రెడ్డి, చాంద్రాయణగుట్టలో ప్రకాశ్‌రెడ్డి ఈ కార్యక్రమాలను ప్రారంభించి, ముందుండి సంతకాలను సేకరించనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి, నేతలు శ్యాంసుందర్‌గౌడ్, గౌతమ్, భవర్‌లాల్ వర్మ, శంకర్‌యాదవ్, రాజశేఖర్‌రెడ్డి, ఉమా మహేంద్ర, రామన్‌గౌడ్, మాచెర్ల శ్రీనివాస్, మహేందర్ వ్యాస్, బండారి రాధిక, కమల్ కంది పాల్గొన్నారు.