హైదరాబాద్

ముంచెత్తిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: మహానగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై సాయంత్రం అయిదు గంటలకు వర్షంగా మారింది. సరిగ్గా ఆఫీసు ముగిసే సమయానికి, విద్యా సంస్థలు విద్యార్థులను వదిలేసే సమయానికి వర్షం దంచికొట్టడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలయారు. నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లు జలమయమయ్యాయి. ఫలితంగా గంటల తరబడి, కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. నిత్యం రద్ధీగా ఉండే లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, పంజాగుట్ట చౌరస్తా, సికిందరాబాద్ ప్యాటీ, రాణిగంజ్, బేగంపేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా వర్షం కురుస్తున్నపుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సిఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రహదారి, బేగంపేట ఫ్లై ఓవర్లపై ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది. ఇక ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సంజీవరెడ్డినగర్ వైపు వెళ్లే మెయిన్‌రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితి వరనాతీతం. వర్షం కురిసి ఆగిన తర్వాత కూడా ట్యాంక్‌బండ్‌పై పలు చోట్ల వర్షపు నీరు నిల్వటంతో వాహనదారులకు చుక్కలు కన్పించాయి. వర్షానికి గాలులు తోడవ్వటంతో రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. ఖైరతాబాద్, అమీర్‌పేట, రాణిగంజ్, లక్డీకాపూల్, బైబిల్‌హౌజ్, ఎం.జె.మార్కెట్, కోఠి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. పలు జంక్షన్లలో సిగ్నల్స్ పనిచేయకపోవటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. కొన్ని జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగి మాన్యువల్‌గా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నిత్యం లక్షలాది వాహనాలతో కిటకిటలాడే లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు మెట్రోపనులు, మరో వైపువర్షం కురుస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పలు కూడళ్లలో గంటల పాటు ట్రాఫిక్ జాం అయినా ఎక్కడా కూడా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. రోడ్లపై వర్షపు నీరు నిలిస్తే వెంటనే తోడేసేందుకు ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచామని ఇదివరకే గ్రేటర్ అధికారులు ప్రకటించినా, ఎక్కడా కూడా సహాయక చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు.