హైదరాబాద్

బోనాలకు బల్దియా నిధులు రూ. 7 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ఆషాఢ మాసంలో తెలంగాణలో అత్యంత ఘనంగా జరిగే బోనాల ఉత్సవాలకు సంబంధించి నగరంలోని వివిధ దేవాలయాల ఆవరణలో ఏర్పాట్ల నిమిత్తం మహానగర పాలక సంస్థ రూ. 7 కోట్లతో పనులు చేపట్టినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పాతబస్తీ ఇతరత్ర వివిధ దేవాలయాల్లో భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా చేపట్టిన వౌలిక వసతుల కల్పన పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బోనాల సందర్భంగా నగరంలోని అన్ని దేవాలయాల ఆవరణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 7 కోట్ల నిధులతో మొత్తం 238 అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బోనాలు, తొట్టెల ఊరేగింపులకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా దేవాలయాలకు చేరుకునే రోడ్లు, రహదారిలో మ్యాన్‌హోల్స్‌లకు మరమ్మతులు, ఫుట్‌పాత్‌ను మెరుగుపర్చటంతో పాటు అదనంగా లైటింగ్‌ను ఏర్పాటు చేసే పనులను చేపట్టన్నుట్లు తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు గుర్తించిన సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ లైటింగ్ వ్యవస్థను గత సంవత్సరం మాదిరిగానే జోన్ల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, బోనాల కోసం చేపట్టిన రూ. 7 కోట్ల 238 పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ ప్రతిపాదనలను సైతం అందుబాటులోకి తీసుకుని పనులను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా దేవాలయాల ఆవరణలో శాబాద్ మండలు వేయటం, భక్తులకు దేవాలయం ఆవరణలో తాగునీరు, కరెంటు సరఫరా వంటి వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.