హైదరాబాద్

కేంద్ర కారాగారాల్లో ఖైదీలు ఫుల్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి. తెలంగాణలోని మూడు కేంద్ర కారాగారాలతో మొదలుకొని మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లల్లోనూ కలిపి 6,848 మంది ఖైదీలను నింపే అవకాశం మాత్రమే ఉంది. కాగా ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో ఇవి పనిచేస్తున్నాయి. అయితే కేంద్ర కారాగారాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది సామర్థ్యం కాగా ప్రస్తుతం 3,500 మంది ఉన్నారు. అలాగే మహిళా కేంద్ర కారాగారం కెపాసిటీ 220 ఉండగా, ప్రస్తుతం 250 మంది ఉన్నారు. జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలో మాత్రం తక్కువగానే ఉన్నారు. అయితే జైళ్ల శాఖ మాత్రం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. మొత్తం 1600 పోస్టులకు 1500 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉగ్ర ఖైదీలు ఉన్న జైళ్లలో భద్రత పెంచాలని ఇటీవల ఎన్‌ఐఏ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో సిబ్బంది కొరతతో భద్రత కొరవడుతుందేమోనని జైళ్లశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే జైళ్ళశాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని పలు జైళ్ల అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రశాంత్ రాండే స్మారక స్టేట్ ర్యాంకింగ్
క్యారమ్ చాంప్స్ శ్రీనివాస్, అపూర్వ
చాంద్రాయణగుట్ట, జూలై 20: నగరంలోని మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ ప్రశాంత్ రాండే స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ చాంపియన్‌షిప్ పురుషుల, మహిళల ట్రోఫీని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన కె.శ్రీనివాస్, ఎల్‌ఐసికి చెందిన ఎస్.అపూర్వ కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జరిగిన సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీనివాస్ 9-25, 25-0 స్కోరుతో ప్రత్యర్థి ఎజిఆఫీస్‌కు చెందిన అనిల్‌కుమార్‌పై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీనివాస్ 25-12, 10-24, 25-12 స్కోరుతో ప్రత్యర్థి ఆర్‌బిఐకి చెందిన సూర్యప్రకాష్‌పై, అనిల్‌కుమార్ 25-9, 4-25, 25-14 స్కోరుతో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అహ్మద్‌పై నెగ్గారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ అహ్మద్ 20-12, 8-21, 25-10 స్కోరు తేడాతో ప్రత్యర్థి ఎల్.సూర్యప్రకాష్‌పై గెలుపూందారు. పురుషుల విభాగంలో జరిగిన డబుల్స్ ఫైనల్లో ఎల్.సూర్యప్రకాష్, ఆదిత్య జోడీ 22-16, 15-4 స్కోరు తేడాతో రవీంద్రగౌడ్, అనిల్‌కుమార్‌పై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. సెమీస్‌లో జరిగిన పోటీలో సూర్యప్రకాష్, ఆదిత్య జంట 17-13, 9-19 స్కోరుతో మహ్మద్ అహ్మద్, షేక్ మహ్మద్‌పై, రవీంద్రగౌడ్, అనిల్‌కుమార్ జోడీ 25-18, 16-25, 20-4 తేడాతో ఎంఎ హకీమ్, షారుఖ్‌ఖాన్‌పై నెగ్గారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ అహ్మద్, షేక్ మహ్మద్ జోడీ 25-20, 25-22తో ఎంఎ హకీమ్, షారుఖ్‌ఖాన్‌పై గెలుపొందారు. మహిళల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌ఐసికి చెందిన ఎస్.అపూర్వ 25-1, 25-10 స్కోరుతో ప్రత్యర్థి పోస్టల్ శాఖకు చెందిన యు.సవితాదేవిపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తృతీయ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో డెలాయిట్‌కు చెందిన నందిని 25-5, 25-0 స్కోరుతో ప్రత్యర్థి నిజామాబాద్‌కు చెందిన శ్రీచందనపై నెగ్గింది. అంతకు ముందు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అపూర్వ 25-0, 25-0 స్కోరుతో నందినిపై, సవితాదేవి 25-5, 25-0 స్కోరుతో ప్రత్యర్థి నిజామాబాద్‌కు చెందిన శ్రీచందనపై గెలుపొందింది. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎన్‌టిపిసి సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విబి ఫడ్నావిస్, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు వివేక్ దేశ్‌పాండే విచ్చేసి విజేతలకి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బికె హరనాథ్, ఎస్.మదన్‌రాజ్, నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభాన్‌రాజ్ పాల్గొన్నారు.