హైదరాబాద్

లష్కర్ బోనాలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వైభోపేతంగా జరుపుకునే సికింద్రాబాద్(లష్కర్) ఉజ్జయినీ మహంకాళి బోనాల వేడుకలకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు నార్త్ జోన్ డిసిపి బి.సుమతి తెలిపారు. ఈనెల 24, 25న జరుగనున్న లష్కర్ బోనాలు, జాతర వేడుకల సందర్భంగా పోలీసుల పరంగా చేపడుతున్న వివిధ ఏర్పాట్లపై ‘అంధ్రభూమి’తో ఆమె మట్లాడారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిష్టాత్మకంగా జరుపుకోనున్న బోనాల పండుగ సందర్భంగా మూడువేల మంది సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. గత వారం రోజులకుపైగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం ఏర్పర్చుకుని పలు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, మహిళలు ధరించే బంగారు అభరణాలు చోరీకి గురికాకుండా యాంటి చైన్‌స్నాచింగ్, షీ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నట్టు పేర్కొన్నారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు, సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, మహిళలు బంగారు ఆభరణాలు ధరించి రానున్నందున వారి భద్రతకు యాంటీ చైన్‌స్నాచింగ్ బృందాలు, మహిళలపై ఎవరైనా వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందితే వెంటనే షీ టీమ్ స్పందిస్తుందని ఆమె చెప్పారు. ప్రతి ఏటా జరుపుకునే విధంగా ఈసారి కూడా బోనాల పండుగను అత్యంత ఉత్సాహం, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. బోనాలు, జాతర వేడుకల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికపుడు వీక్షించే విధంగా నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా కన్నుల పండువగా జరిగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. ఉత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు కోసం ఆర్‌ఎఎఫ్ దళాలు, తెలంగాణ స్పెషల్ పోలీసు, వివిధ జిల్లాకు చెందిన పోలీసులతో పాటు నగరానికి చెందిన మొత్తం మూడువేల మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నట్లు సుమతి చెప్పారు. ఇందులో 400 మంది పోలీసు అధికారులు ఉంటారని, వేడుకలో ఏమాత్రం పొరపాట్లు జరుగకుండా ఉండేందుకు ఎప్పటికపుడు పరిస్థితులను అంచన వేయడానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు భక్తుల కదలికను గమనించేలా అధునాతనమైన 139 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.
ఈనెల 23వ తేదీ సాయంత్రం నాటికి వివిధ జిల్లాల నుండి పోలీసులు సికింద్రాబాద్‌కు చేరుకుంటారని వారు మూడు రోజుల పాటు విధులు నిర్వహిస్తారని వివరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేకంగా నాలుగు క్యూలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఒకిటి విఐపిలు, బోనాలు సమర్పించేందుకు వచ్చేవారి కోసం, జనరల్ పబ్లిక్‌తో పాటు అత్యవసర సేవల కోసం నాలుగో క్యూలైన్‌ను వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్స్‌తో పాటు ప్రధాన కూడాళ్లలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహంకాళీ పోలీస్టేషన్‌లో వివిధ శాఖల అధికారులతో పాటు శాంతిభద్రలను పర్యవేక్షించేందుకు ‘పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వేడుల్లో పాల్గొని తప్పిపోయిన చిన్నారుల కోసం మిస్సింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు వార్మ్ కెమెరాలు ధరిస్తారన్నారు. బాటా, రాంగోపాల్‌పేట్, జనరల్‌బజార్, మహంకాళి పోలీస్టేషన్ సమీపంలో అతి పెద్ద స్క్రిన్ కలిగిన టివిలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆపరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వేడుకలను పోలీసు అధికారులు పరిశీలించడంతో పాటు ఎక్కడైనా తొక్కిసలాట జరిగిన క్షణంలో సహయక చర్యలు చేపట్టేందుకు వీలుంటుందన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉత్సవాలు భక్తులు ఆనందోత్సహల మద్య శాంతియుతు వాతవారణంలో జరుపుకోవాలని డిసిపి కోరారు. పోలీసులకు సంబంధించిన రక్షక్ వాహనాలపై 360 డిగ్రీలతో కూడిన అధునాతనమైన హైడ్రాలిక్ కెమెరారాలను కూడా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశామని అమె పేర్కొన్నారు.